News
News
X

Allu Arjun: రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. అభిమానుల కోసం రూ. 10 కోట్ల ఆఫర్ ని వదులుకున్నారు.

FOLLOW US: 

కాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. అభిమానుల కోసం రూ. 10 కోట్ల ఆఫర్‌ను వదులుకుని రోల్ మోడల్‌గా నిలిచారు. అదేంటి అనుకుంటున్నారా? కారణం తెలిస్తే మీరు కూడా బన్నీని పొగడ్తలతో ముంచెత్తుతారు. 

షారుక్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్లే తమ విలువలను పక్కనబెట్టి పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఆయా సంస్థలు సెలబ్రిటీలకు కోట్లు అప్పజెబుతున్నాయి. ‘పుష్ప’ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్‌కు వస్తున్న క్రేజ్‌ను ఆయా పొగాకు సంస్థలు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు భారీ ఆఫర్ ఇచ్చాయి. 

ఔనండి, పొగాకు ఉత్పత్తులకి సంబంధించిన ఒక సంస్థ ఓ ప్రకటనలో నటించాలని అల్లు అర్జున్ ని సంప్రదించారు. దాన్ని ఆయన రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం బన్నీ అనేక ప్రకటనల్లో నటిస్తూ కనిపిస్తున్నారు. దుస్తులు, శీతల పానియాలకు సంబంధించిన కంపెనీల యాడ్స్, బస్సు, బైక్ ప్రయాణాలకి సంబంధించిన యాప్స్‌కు ప్రచారకర్తగా ప్రకటనల్లో నటిస్తున్నారు.

షూటింగ్స్ నుంచి కాస్త విరామ తీసుకున్న ఆయనకి పలు కంపెనీలకు చెందిన ప్రకటనల్లో నటిస్తూ భారీగానే పారితోషకం అందుకుంటున్నారు. ఇప్పటికే బన్నీ ఒక్కో యాడ్‌కు రూ.7.5 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా బన్నీ దగ్గరకి మరో ప్రపోజల్ వచ్చింది. పొగాకు, లిక్కర్ ఉత్పత్తులని ప్రమోట్ చేస్తూ ఇచ్చే ప్రకటన కోసం సదరు సంస్థ బన్నీని సంప్రదించింది.

ఆ యాడ్‌లో కొన్ని సెకన్ల పాటు కనిపించేందుకు గాను రూ.10 కోట్ల పారితోషకం ఇస్తామని ఆ సంస్థ ఆఫర్ చేసిందట. కానీ దాన్ని చేసేందుకు బన్నీ ఒప్పుకోలేదు. ఇటువంటి బ్రాండ్స్ ప్రమోట్ చేస్తే అభిమానుల్లోకి నెగటివ్ ప్రచారం వెళ్తుందని, అటువంటిది తాను చేయలేనని సూటిగా చెప్పేసారట బన్నీ. ఈ విషయం తెలిసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎంతైనా బన్నీ గ్రేట్ కదా అని అంటున్నారు. డబ్బు కోసం అటువంటి ఉత్పత్తులకి సంబంధించిన యాడ్స్‌లో నటించకపోవడమే బెటర్ అని అభిమానులు తెలుపుతున్నారు. 

గతంలో కూడ అల్లు అర్జున్ పొగాకు సంబంధించిన ప్రకటనల్లో నటించే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేశారు. అయినా బన్నీ క్రేజ్ చూసి మరో సారి అటువంటి ఆఫర్ వచ్చినప్పటికీ దాన్ని కూడా వదులుకున్నారు. ఇటీవలే ఓ పైపుల కంపెనీకి చెందిన ప్రకటనలో అల్లు అర్జున్ గెటప్‌కు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆ యాడ్ ని డైరెక్ట్ చేశారు. చెవిపోగు, చేతిలో సిగార్, మాస్ హెయిర్ స్టైల్ తో బన్నీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ లుక్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం సినిమాల నుంచి స్వల్ప విరామ తీసుకుని బన్నీ ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ హీరో 'పుష్ప' పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అలానే అనసూయ, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లో, లేదంటే వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.  

Also Read: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్

Also Read : నేను మహేష్ బాబు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Published at : 11 Aug 2022 12:40 PM (IST) Tags: Allu Arjun Pushpa Star Allu Arjun Allu Arjun Rejects Ads Offer

సంబంధిత కథనాలు

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!