Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్
హీరో విశాల్ మళ్లీ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
![Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్ Hero Vishal was seriously injured in an accident on the shooting set Hero Vishal: షూటింగ్ సెట్లో ప్రమాదం, తీవ్ర గాయాలపాలైన హీరో విశాల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/16d63aa8950ff7c6423ad053e4d480611660196425735248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హీరో విశాల్ కొన్ని రోజుల క్రితమే షూటింగ్లో గాయపడ్డారు. ఇంకా ఆ విషయం ఆయన అభిమానులు మరిచిపోకముందే మళ్లీ ఆయన తీవ్ర గాయాలపాయ్యారు. ప్రస్తుతం ఆయన మార్క్ ఆంటోని అనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ సినిమాకు సంబంధించి కొన్ని ఫైట్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. విశాల్ అలాంటి సీన్లను డూప్ లేకుండా చేసేందుకే ఇష్టపడతారు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. అలా ఆయన ఫైట్ సీన్స్ చేస్తుండగా ప్రమాదం జరగింది. ఎలా జరిగిందో పూర్తి వివరాలు బయటికి రాలేదు. కానీ విశాల్‌కు గాయాలు తీవ్రంగానే తగిలాయి. షూటింగ్ సెట్లోనే ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విశాల్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం లాఠీ అనే సినిమా షూటింగ్లో కూడా ఆయనకు గాయాలయ్యాయి. ఆయన త్వరగానే వాటి నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. విశాల్ గతంలో కూడా చాలా సినిమా షూటింగ్‌లలో గాయపడుతూ వస్తున్నారు. 2014 నుంచి ఆయన చేసిన అన్ని సినిమాల్లో గాయాలపాలవుతూనే ఉన్నారు. తమిళంలో పెద్ద హీరోగా పేరుతెచ్చుకున్నారు విశాల్. గతేడాది ఎనిమి, చక్ర సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో లాఠీ సినిమా విడుదల కానుంది.
విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఈయన తెలుగు వ్యక్తే అయినా తమిళంలో సెటిలైంది కుటుంబం. అన్న విక్రమ్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 2004లో ప్రేమ చదరంగం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విశాల్. మొదట్లో సహాయ దర్శకునిగా చేశారు. తరువాత అతను హీరోగా మారారు.
Also read: హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం
Also Read : నేను మహేష్ బాబు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
బాలీవుడ్ నటి టబు కూడా షూటింగ్లో గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన ‘భోలా’ సినిమాలో నటిస్తోంది టబు. ముంబైలో సినిమా చిత్రీకరిస్తున్నారు. ఆ షూటింగ్లో ప్రమాదం జరిగి ట్రక్ అద్దాలు పగిలాయి. అవి టబూకు గుచ్చుకున్నాయి. దీంతో షూటింగ్ ఆపేసి టబును ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల పాటూ షూటింగ్ ఆపేశారు. గతంలో కూడా చాలా మంది నటీనటులు ఇలా షూటింగ్ సమయంలో గాయపడిన సందర్భాలు ఉన్నాయి.
Breaking News !!
— Vishal Fans 24x7 ™ (@VishalFans24x7) August 11, 2022
Our Puratchi Thalapathy #Vishal Anna got severely injured early this morning while filming a rigorous fight sequence for the movie #MarkAntony.@VishalKOfficial @HariKr_official
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)