News
News
X

Tabu Injured : హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం

హీరోయిన్ టబు హైదరాబాద్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. కుట్లు వేయాల్సిన అవసరం రాలేదు రెప్ప పాటులో కంటికి ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.

FOLLOW US: 

హీరోయిన్ టబు (Actress Tabu) కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. అదీ మన భాగ్య నగరంలో! అవును... ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్‌లో ఉన్నారు. బాలీవుడ్ మూవీ 'భోళా' (Bholaa Hindi Movie) షూటింగ్ చేస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్న సమయంలో టబుకు ఇంజ్యూరీ అయినట్టు తెలుస్తోంది. అయితే... ప్రమాదం ఏమీ లేదట. రెప్ప పాటులో కంటికి పెను ప్రమాదం తప్పిందని యూనిట్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే...

కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన 'ఖైదీ' (Khaidi Movie) గుర్తు ఉంది కదా!? ఇప్పుడు ఆ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది. అదే ఈ 'భోళా' సినిమా. ఇందులో టబుది పోలీస్ ఆఫీసర్ రోల్. అజయ్ దేవగణ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు.

సెట్స్‌లో టబుకు ఏమైంది?
'భోళా' కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి తీస్తున్నారు. అందులో ఒక భారీ ట్రక్‌లో టబు ఉన్నారు. ఆ ట్రక్‌ను కొంత మంది బైకర్స్ వెంబడించే సీన్స్ తీస్తున్నారు. ఓ బైకర్ అనుకోకుండా యాక్సిడెంట్ చేశారు. గ్లాస్ పగలడంతో గాజు ముక్కలు వచ్చి టబు ముఖం మీద పడ్డాయి. గాయాలు కావడంతో రక్తం కారిందట. ముందు జాగ్రత్తగా సెట్స్‌లో వైద్యులను ఉంచడంతో వెంటనే చికిత్స అందించారట.
 
కుట్లు పడలేదు కానీ... 
టబుకు అయిన ఇంజ్యూరీ చిన్నదే అని, కుట్లు వేయాల్సిన అవసరం రాలేదని 'భోళా' యూనిట్ సభ్యులు తెలిపారట. అయితే... కన్నుకు మాత్రం పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. కుడి కన్నుకు కొంచెం పైన టబుకు గాజు ముక్కలు గుచ్చుకున్నాయట. అదృష్టవశాత్తూ కంటికి ఏమీ కాలేదని చెబుతున్నారు. అటూ ఇటూ అయ్యి కంటి మీద పడితే ప్రాబ్లమ్ అయ్యేది.

Also Read : వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను : శిల్పాశెట్టి

టబుకు చిన్న గాయమే అయినప్పటికీ... అజయ్ దేవగణ్ కొంత సమయం షూటింగ్ ఆపేశారట. బ్రేక్ ఇచ్చారట. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు నాలుగో చిత్రమిది. ఇంతకు ముందు మూడు సినిమాలు తీశారు. ఆయన దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'రన్ వే 34'లో ఆకాంక్షా సింగ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. 

అజయ్ దేవగణ్, టబు మధ్య మంచి స్నేహం ఉంది. హీరో హీరోయిన్లుగా వాళ్ళిద్దరూ పలు సినిమాలకు పని చేశారు. ఈ మధ్య కాలంలోనూ అజయ్ సినిమాల్లో టబుకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. 'దే దే ప్యార్ దే'లో టబు హీరోయిన్ అని చెప్పాలి. 'గోల్ మాల్ అగైన్'లో కూడా ఆవిడది హీరోయిన్ టైప్ రోల్. 'దృశ్యం' సినిమాకు రీమేక్ గా అదే పేరుతో రూపొందిన అజయ్ దేవగణ్ హిందీ సినిమాలో కూడా టబు నటించారు. తెలుగులో నదియా పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రను హిందీలో టబు చేశారు. 

Also Read : నేను మహేష్ బాబు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Published at : 11 Aug 2022 07:04 AM (IST) Tags: Ajay Devgn Hyderabad Tabu Health Update Tabu Injured Bholaa Movie

సంబంధిత కథనాలు

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Manchu Vishnu: 'నా ఫ్యామిలీను హెరాస్ చేశారు, ఆ ప్రముఖ నటుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది' మంచు విష్ణు కామెంట్స్!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Asha Parekh: వెటరన్ స్టార్ ఆషా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు!

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

Balakrishna - Unstoppable Anthem : బాలయ్య ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంట! - రెండోసారి హిస్టరీ రిపీట్ చేసేలా 'అన్‌స్టాప‌బుల్‌ 2'

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

Chiranjeevi - Najabhaja song : గజగజ వణికించే గజరాజడిగోరో - మెగాస్టార్ రేంజ్ సాంగ్ అంటే ఇదీ

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam