అన్వేషించండి

Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!

Jr NTR Latest Interview: 'ఆయుధ పూజ' పాటలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ. అయితే... ఈసారి పాటను మళ్లీ చూస్తే, మీకు ఓ డిఫరెన్స్ కనబడుతుంది. అది ఏమిటో తెలుసా?

'దేవర' (Devara Part 1) ప్రదర్శిస్తున్న థియేటర్లలో 'ఆయుధ పూజ' పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) అభిమానులు స్టెప్పులు వేయడం మొదలు పెడుతున్నారు. పరవశంతో పులకించిపోతున్నారు. అయితే...‌‌ ఆ పాట చిత్రీకరణ చేసేటప్పుడు హీరో చేతికి గాయమైంది. ఈసారి కనుక సినిమా లేదా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక విషయంలో తేడా స్పష్టంగా కనబడుతుంది. అది ఏమిటంటే... 

ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో...
'దేవర' ఘన విజయం సాధించిన సందర్భంగా సుమ కనకాలకు ఎన్టీఆర్, చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు.‌‌ వారి మధ్య 'ఆయుధ‌ పూజ' పాట గురించి, అందులో ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల గురించి డిస్కషన్ వచ్చింది. 

'ఆయుధ పూజ సాంగ్ షూటింగ్ చేసేటప్పుడు తన చేతి మణికట్టు భాగంలో గాయం అయిన సంగతిని ఎన్టీఆర్ తాజాగా బయట పెట్టారు. ''ఆ పాటలో నేను కత్తి తిప్పే సందర్భం ఒకటి ఉంది. అది చేసేటప్పుడు చేతికి గాయమైంది. దాంతో ఒక స్టెప్ వేసేటప్పుడు ఆ చేతిని వెనక పెట్టుకుని వేశాను'' అని ఎన్టీఆర్ వివరించారు. 'దేవర అడిగినాడు అంటే సెప్పినాడు అని అర్థం' డైలాగ్ చెప్పే సమయంలో కూడా తన చేతికి గాయం ఉందని, అందుకే ఆ సన్నివేశంలో ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నానని ఎన్టీఆర్ వివరించారు. ప్రేక్షకులు, అభిమానులు ఈసారి ఆ సాంగ్ చూసినప్పుడు నిశితంగా గమనిస్తే ఆ మార్పు స్పష్టంగా తెలుస్తుంది.

ఆయుధ పూజ పాట గురించి, ఎన్టీఆర్ చేతికి అయిన గాయం గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... ''ఎన్టీఆర్ గారు డాన్స్ చేస్తుంటే మానిటర్ ముందున్న నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. అయితే ఆయన చేతికి గాయం కావడానికి ముందు ఎడమచేత్తో గుండెను కొట్టుకునే సన్నివేశం పూర్తి చేశాం. కత్తి తిప్పిన సమయంలో చెయ్యి బెణికినట్టు అనిపించింది. ఆరోజు రాత్రి లేదంటే ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు. తీరా చూస్తే చేతికి పెద్ద కట్టు వేశారు. అయినా సరే అభిమానుల కోసం ఆయన అలాగే డాన్స్ చేశారు'' అని చెప్పారు.

Also Read: మెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?


తాత గారిని ఇమిటేట్ చేయాలని అనుకోలేదు! 
'ఆయుధ పూజ' పాటలో ఎన్టీఆర్ వేసిన ఒక స్టెప్ ఆయన తాతయ్య, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మార్క్ మేనరిజాన్ని గుర్తు చేసిందని కొందరు అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించినప్పుడు తాత గారిని ఇమిటేట్ చేయాలని తాను అనుకోలేదని అలా ఫ్లోలో వచ్చేసిందని తెలిపారు. గణేష్ ఆచార్య మాస్టర్ ఎప్పటి నుంచో నాతో ఒక సాంగ్ చేయాలని అనుకుంటున్నారని, ఈ పాటతో కుదిరిందని ఆయన చెప్పారు.

''ఆయుధ పూజ పాటను మేం చివరిగా షూటింగ్ చేశాం. అప్పుడు సంగీత దర్శకుడు అనిరుద్ చాలా బిజీ. అమెరికాలో కాన్సర్ట్స్, టూర్స్ అంటూ తిరుగుతున్నాడు. ఆ సాంగ్ షూటింగ్ చేయడానికి మూడు రోజుల ముందు ట్యూన్ ఇచ్చాడు. ఒక్క రోజులో రామ జోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. నిజంగా ఆయనకు దండం పెట్టాలి. 'దేవర' కథతో ముందునుంచే ట్రావెల్ అవుతూ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఆయన నరాలలో జీర్ణించుకో పోయింది. ఆయన్ను సరస్వతీపుత్ర అంటారు కదా. ఆ రోజు నిజంగా అదే అనిపించింది'' అని ఎన్టీఆర్ తెలిపారు.

Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?

''ప్రతి సినిమాకు ఒక పాట లేదంటే ఒక సన్నివేశం చివరి వరకు మనల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మనం ఎంత ప్రయత్నించి చూసినా సరే చివరి వరకు పూర్తి కాదు. 'దేవర' సినిమాలో 'ఆయుధ పూజ...' పాట అటువంటిదే. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ పాట గురించి మేము అనుకుంటున్నాం. అది చివరకు పూర్తి అయ్యింది'' అని ఎన్టీఆర్ షూటింగ్ డేస్ గుర్తు చేసుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget