News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

NTR Back To India : ఇండియా వచ్చేసిన ఎన్టీఆర్ - ఈ వారమే 'దేవర' సెట్స్‌కు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియా వచ్చేశారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఫారిన్ ట్రిప్ వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? అని చూస్తే...

FOLLOW US: 
Share:

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇండియా వచ్చేశారు. భార్య ప్రణతి లక్ష్మి, అబ్బాయిలు అభయ్ రామ్ & భార్గవ్ రామ్ (Jr NTR Family)తో కలిసి మే నెలాఖరున విహార యాత్రకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇండియా తిరిగి వచ్చేశారు.

ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళారంటే?
NTR Dubai Trip : ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ దుబాయ్ వెళ్ళి వచ్చారు. హైదరాబాద్ నుంచి గత ఆదివారం వెళితే... ఈ ఆదివారానికి తిరిగి వచ్చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ వారం 'దేవర' లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. సోమవారం నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 

దుబాయ్ వెళ్లినా సరే వర్కవుట్స్ మానలేదు!
ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ వెళ్లిన తర్వాత ఆయన ట్రైనర్ ఓ ఫోటో పోస్టు చేశారు. అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ''హాలిడేలో ఉన్నప్పటికీ... మా 'దేవర' చెమట చిందుస్తున్నాడు'' అని 'దేవర' టీమ్ పేర్కొంది. 'ఆర్ఆర్ఆర్'తో పోలిస్తే... కొత్త సినిమాలో ఎన్టీఆర్ ఫిజిక్ వేరుగా ఉంటుందని తెలిసింది. క్యారెక్టర్ కోసం ఆయన కష్టపడుతున్నారు. 

View this post on Instagram
 
A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Movie). 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. జూన్ 5న మొదలు అయ్యే కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమానులను, ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకుంటోంది.

Also Read : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై 'దేవర' సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్నారు. 

Also Read చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

సాధారణ యాక్షన్ సన్నివేశాన్ని సైతం తన నటనతో నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళతారు. ఇక, పవర్ ఫుల్ యాక్షన్ సీన్ అయితే ఆయన చెలరేగిపోతారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'లో ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాన్ని అంత త్వరగా ఎవరు మర్చిపోతారు చెప్పండి! కొరటాల శివ కూడా ఎన్టీఆర్ కోసం ధీటైన యాక్షన్ ప్లాన్ చేశారట.  

'దేవర'లో 'కెజిఎఫ్' నటుడు తారక్ పొన్నప్ప!
కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన 'కెజిఎఫ్' సినిమా గుర్తు ఉందా? అందులో మాఫియా డాన్స్ బాస్ శెట్టి ఆండ్రూ సెక్రటరీ పాత్ర చేసిన తారక్ పొన్నప్ప (Tarak Ponnappa) గుర్తు ఉన్నారా? . తెలుగులో ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన 'సిఎస్ఐ సనాతన్' సినిమాలో కూడా ఆయన నటించారు. అతను ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు.

Published at : 04 Jun 2023 10:18 AM (IST) Tags: Jr NTR Tollywood Latest News NTR New Movie Updates Devara Movie Dubai Trip NTR At Airport

ఇవి కూడా చూడండి

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

టాప్ స్టోరీస్

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!

కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!