Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందని, స్వయంగా ఆయన చెప్పారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు నిజం ఏమిటి? అసలు ఆయన చెప్పింది ఏమిటి? ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ చేస్తే...
తెలుగు సినిమా ప్రేక్షకులకు, మెగా అభిమానులకు శనివారం సాయంత్రం పెద్ద షాక్ తగిలింది. ఒకవైపు చిన్న బాధ, మరో వైపు ఆనందం! ఎందుకు అంటే... అగ్ర హీరో స్వయంగా తనకు క్యాన్సర్ వచ్చిందని, ముందుగా గుర్తించడంతో ప్రమాదం తప్పిందని చెప్పినట్లు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. చిరుకు క్యాన్సర్ వచ్చిందని తెలిసినా, దాన్నుంచి బయట పడటంతో సంతోషం వ్యక్తం చేశారంతా! అయితే... ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ చాలా మంది ఆయనకు ఫోన్లు చేశారు. దాంతో ఆయన సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు.
ముందస్తు జాగ్రత్త అవసరమని చెప్పా...
క్యాన్సర్ రాలేదు. క్యాన్సర్ కింద మారేదేమో!
''కొద్ది సేపటి క్రితం నేను ఒక క్యాన్సర్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాన్ - క్యాన్సరస్ పాలిప్స్ (non - cancerous polyps)ని డిటెక్ట్ చేసి తీసేశారని చెప్పాను. 'అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయి ఉంటే అది క్యాన్సర్ కింద మారేదేమో' అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి' అని మాత్రమే అన్నాను'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
వారందరి కోసమే ఈ వివరణ - చిరంజీవి
''నేను చెప్పిన మాటలను కొంత మంది సరిగా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో 'నేను క్యాన్సర్ బారిన పడ్డాను' అని, 'చికిత్స వల్ల బతికాను' అని స్క్రోలింగ్ లు మొదలు పెట్టారు. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అనేక మంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయడం వల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అని చిరంజీవి సున్నితంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
మొగల్తూరులో తన స్నేహితుడు సైతం ఊపిరితిత్తుల సమస్య వచ్చిందని, ఆ తర్వాత అది క్యాన్సర్ అని తేలిందని ఆస్పత్రి ప్రారంభోత్సవంలో చిరంజీవి తెలిపారు. అతనికి రెండో దశ క్యాన్సర్ అని తెలిసిన వెంటనే చికిత్స ప్రారంభించామని, ఇప్పుడు తన స్నేహితుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చిరంజీవి వివరించారు. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందని పేర్కొన్నారు.
ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు! - చిరంజీవి
సినిమా కార్మికులు, అభిమానుల కోసం ఏదైనా చేయమని స్టార్ ఆస్పత్రి వర్గాలను చిరంజీవి కోరారు. ''మా సినిమా కార్మికులు చాలా పేదవాళ్ళు. రేయి పగలు, దుమ్ము ధూళి, మట్టి వాన వంటివి పట్టించుకోకుండా పని చేస్తారు. అటువంటి వాళ్లకు ఏమైనా చేయగలిగితే బావుంటుంది. వాళ్ళ కోసం, మా అభిమానుల కోసం ప్రతి జిల్లాలో స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేస్తే బావుంటుంది. ఎన్ని కోట్లు అయినా పర్వాలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెబుతాను'' అని చిరంజీవి అడిగారు. చిరంజీవి ఎలా చేద్దామని చెబితే అలా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్టార్ హాస్పిటల్ ప్రతినిథులు చెప్పారు. ప్రతి వారం, రెండు వారాలకు ఒకసారి అయినా సరే క్యాంపులు పెడదామని ఆస్పత్రి వర్గాలు ప్రతిపాదించాయి.
Also Read : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ