తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయమైన సినిమా 'అహింస'. బాబాయ్ వెంకటేష్, అన్నయ్య రానాలా పేరు తెచ్చుకుంటాడా? 

కథ : రఘు (అభిరామ్), అహల్య (గీతికా) బావామరదళ్ళు. అహల్యను ఇద్దరు రేప్ చేయడంతో కేసు పెడతాడు రఘు.

రఘుకు లాయర్ లక్ష్మి (సదా) సాయం చేస్తుంటుంది. ఆమె ఫ్యామిలీని రేప్ చేసిన ఇద్దరి తండ్రి చంపేస్తాడు. 

కొడుకుల కోసం అహల్యనూ చంపాలని ప్లాన్ చేస్తాడు. అప్పుడు అహింసావాది రఘు, హింస వైపు ఎలా మళ్ళాడు?

మరదలి కోసం రఘు ఏం చేశాడు? ఎవరెవరిని చంపాడు? చివరికి ఏమైంది? అనేది మిగతా సినిమా.

ఎలా ఉంది? : చీమకు సైతం హాని తలపెట్టనోడు కత్తి పడితే? - ఇదీ తేజ కాన్సెప్ట్! లైన్ బావుంది. కానీ, తీత బాలేదు.

'నువ్వు నేను', 'జయం' రోజుల నుంచి ఇంకా తేజ బయటకు రాలేదా? అనిపిస్తుంది 'అహింస' చూస్తున్నంత సేపూ!

కథ, కథనాలు బాలేని సినిమాలో సాంగ్స్, సాహిత్యం, సినిమాటోగ్రఫీ బావున్నాయి. 

నటుడిగా అభిరామ్ ఓనమాలు దిద్దే స్థాయిలో ఉన్నారు. ఇంప్రూవ్ కావాలి. క్లోజప్స్ ఉన్నవి కొన్ని సీన్సే. అవీ సరిగా చేయలేదు. 

గీతిక ఫేస్ బావుంది. మంచి క్యారెక్టర్స్ పడితే ఆమెకు భవిష్యత్ ఉంటుంది. మిగతా ఆర్టిస్టులు ఓవర్ యాక్షన్ చేశారు.

థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను చిత్ర హింసలకు గురి చేసే చిత్రమిది.