స్కూల్ బుక్స్ సెట్‌కి తీసుకెళ్లి షారుఖ్ అంకుల్‌తో ఆడుకునేదాన్ని - 'జవాన్' చైల్డ్ ఆర్టిస్ట్!
షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' మూవీలో నయనతార కూతురిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ సీజా సరోజ్ మెహతా తాజా ఇంటర్వ్యూలో 'జవాన్' మూవీ ఎక్స్ పీరియన్స్ గురించి పంచుకుంది.
షారుఖ్ ఖాన్ - అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన 'జవాన్'(Jawan) వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 7న విడుదలై ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సినిమాలో షారుఖ్ తన మాస్ యాక్టింగ్ తో అదరగొట్టేసారు. ఆయన ఒక్కరే కాకుండా మిగతా రోల్స్ లో నటించిన వాళ్లంతా కూడా పాత్రకు తగ్గట్టు అద్భుతమైన నటన కనబరిచారు. అలా సినిమాలో నయనతార కూతురి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సీజ సరోజ్ మెహతా కూడా తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. 'జవాన్' మూవీ ఎక్స్పీరియన్స్ గురించి ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో సీజా సరోజ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
'షూటింగ్ టైంలో అట్లీ అంకుల్, షారుక్ అంకుల్ తనను ఎలా ఎంటర్టైన్ చేశారో తెలిపింది. 'జవాన్'లో సీజ పాత్రకు స్క్రీన్ టైం తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంతలో తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ముఖ్యంగా షారుక్, సీజా ల మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటూనే ఎమోషనల్ గానూ కనెక్ట్ చేస్తాయి. అంతలా సినిమాలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకున్న సీజా సరోజ్ తాజా ఇంటర్వ్యూలో ఫ్యూచర్లో హీరోయిన్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. జవాన్ మూవీ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంటూ ఓ వైపు స్కూల్, మరో వైపు షూటింగ్.. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసేదో చెప్పింది.
"నేను స్కూల్ బుక్స్ ను 'జవాన్' సెట్ కి తీసుకెళ్లి అక్కడ చదువున్నా. సెట్లో అందరూ నాతో చాలా మంచిగా ఉన్నారు. నేను సీన్ లో బాగా యాక్ట్ చేసిన ప్రతీసారి అట్లీ అంకుల్ నాకు చాక్లెట్స్ ఇచ్చేవారు. అతను చాలా మంచివాడు" అని చెప్పింది. షూటింగ్ విరామ సమయంలో తనను బాగా ఎంటర్టైన్ చేసిన షారుఖ్ ఖాన్ పై సీజా ప్రశంసలు కురిపించింది. "షూటింగ్లో షారుక్ అంకుల్ నాతో చాలా సరదాగా ఉండేవారు. నన్ను చాలా ఎంటర్టైన్ చేశారు. సెట్ లో నాతో క్యాచ్ కూడా ఆడతారు" అని తెలిపింది. 'జవాన్' మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సీజా ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది.
Also Read : షారుఖ్ ఖాన్ కోసం దీపికా పదుకోన్ ఫ్రీగా నటించారా?
ఈ క్రమంలోనే నటనపై తనకున్న ఆసక్తి గురించి మాట్లాడుతూ " నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో నటించాడాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను. సినిమాలు చేస్తూనే చదువుపై కూడా దృష్టి సారిస్తాను" అని చెప్పుకొచ్చింది. దీంతో సీజ సరోజ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే సీజా సరోజ్ పూణే సిటీకి చెందింది. 8 ఏళ్ల ఈ చిన్నారి ప్రస్తుతం మూడో క్లాస్ చదువుతోంది. ఈమెకి ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేదు. సీజా వాళ్ళ నాన్న ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. కానీ సీజా అక్క ఓ నటి అని సమాచారం. ప్రస్తుతం జవాన్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న సీజా సరోజ్ రాబోయే రోజుల్లో బాలీవుడ్ లో మరికొందరు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు.
Also Read : ఆ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న 'బ్రో' నిర్మాతలు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial