Priyamani: 'జవాన్' డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి
సౌత్ హీరోయిన్ ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'జవాన్' డైరెక్టర్ అట్లీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు అట్లీ తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది.
సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా షారుక్ ఖాన్ 'జవాన్’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఆడియన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా 'జవాన్' సినిమాని థియేటర్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్లో తక్కువ సమయంలో రూ.300 కోట్ల మార్క్ ని దాటికి సరికొత్త రికార్డు నెలకొల్పింది. షారుక్ గత చిత్రం 'పఠాన్' కూడా తక్కువ సమయంలో రూ.300 కోట్ల మార్క్ ని అందుకొని అరుదైన ఘనత సాధించడం విశేషం. అలా బ్యాక్ టు బ్యాక్ ఒకే ఏడాది రెండు సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు షారుక్.
ఇప్పటికే ఈ సినిమాపై మూవీ టీం ప్రశంసలు అందుకుంటుంది. సినిమాలో నటించిన ప్రతి పాత్రకు ఆడియన్స్ నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రకు న్యాయం చేశారు. అలా 'జవాన్' లో కీలక పాత్ర పోషించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది సౌత్ హీరోయిన్ ప్రియమణి. సినిమాలో లక్ష్మి అనే పాత్ర పోషించింది. అలాగే షారుఖ్ ఖాన్ గర్ల్స్ స్క్వాడ్ లో మెయిన్ మెంబర్ గా అదరగొట్టింది. ఇదిలా ఉంటె అట్లీ తనను మోసం చేశాడని ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది. రిలీజ్ కి ముందు 'జవాన్' సినిమాపై చాలా రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ క్యామియో రోల్ చేస్తున్నారనే వార్త ఎంతో వైరల్ అయింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక అది అబద్ధమని తెలిసింది.
అయితే ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ సినిమాలో షారుక్ తో పాటు విజయ్ కూడా ఉన్నట్లు అట్లీ తనతో చెప్పాడని, దాంతో ఎలాగైనా విజయ్‌తో తనకు ఓ సీన్ ఉండేలా చూడమని తాను అట్లీని కోరినట్లు ప్రియమణి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "డైరెక్టర్ అట్లీ వీడియో కాల్ లో మాట్లాడుతూ ‘జవాన్’లో నటించమని అడిగారు. అయితే నేను స్పెషల్ సాంగ్ ఏమో అని ముందు అనుకున్నా. ఆ తర్వాత కీరోల్ అని చెప్పారు. అలాగే సినిమాలో దళపతి విజయ్ కామియో రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది అది నిజమేనా అని అడిగాను. దానికి అట్లీ.. విజయ్‌తో చేయిపిస్తే పోతుంది ఏముంది అన్నాడు. అలాగే నాకు విజయ్‌తో సన్నివేశం ఉండేలా చూడండి అని అన్నాను. కానీ ఆ తర్వాత సినిమాలో విజయ్ నటించలేదు. ఈ విషయంలో అట్లీ నన్ను మోసం చేశారు" అని సరదాగా చెప్పుకొచ్చింది ప్రియమణి.
దీంతో ప్రియమణి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాకుండా 'జవాన్' సినిమాలోని ఓ పాటలో షారుక్ ఖాన్ నన్ను తన పక్కనే ఉండేలా కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ తో చెప్పాడు అనే విషయాన్ని కూడా ప్రియమణి గతంలో పంచుకుంది. ఎందుకంటే చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా సమయంలో తన నుంచి డాన్స్ నేర్చుకున్నానని, అందువల్లే తనను పక్కన పెట్టుకోవాలని షారుక్ ఖాన్ చెప్పాడంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.
Also Read : అమీర్, షారుక్ మధ్య ఉన్న ఒకే ఒక కామన్ క్వాలిటీ అదే: సానియా మల్హోత్రా
Join Us on Telegram: https://t.me/abpdesamofficial