అన్వేషించండి

అమీర్, షారుక్ మధ్య ఉన్న ఒకే ఒక కామన్ క్వాలిటీ అదే: సానియా మల్హోత్రా

బాలీవుడ్ హీరోయిన్ సానియా మల్హోత్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

బాలీవుడ్ హీరోయిన్ సానియా మల్హోత్రా ప్రస్తుతం 'జవాన్'(Jawan) సక్సెస్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తోంది. అట్లీ దర్శకత్వంలో షారుక్ హీరోగా నటించిన ఈ మూవీలో సానియా మల్హోత్రా డాక్టర్ రోల్ లో తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది సానియా మల్హోత్ర. ఈ సినిమాలోనూ అమీర్ ఖాన్ కూతురుగా అదరగొట్టింది. మళ్లీ చాలాకాలం తర్వాత షారుక్ ఖాన్ లాంటి అగ్ర హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటించి ఆకట్టుకుంది. అయితే అమీర్, షారుక్ లాంటి అగ్రహీరోలతో నటించిన సానియా వాళ్ళలో ఉన్న కామన్ పాయింట్ ని రివిల్ చేసింది.

తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మల్హోత్రాని 'మీరు అమీర్, షారుఖ్ ఇద్దరు స్టార్స్ తో పనిచేశారు కదా, వాళ్ళలో మీరు గమనించిన సిమిలారిటీస్ ఏంటని? రిపోర్టర్ అడగగా.." సినిమాపై వాళ్లకున్న ఫ్యాషన్. ఈ ఒక్క క్వాలిటీ ఇద్దరిలో నేను గమనించాను. వాళ్లు యాక్టింగ్ ని చాలా ఇష్టపడతారు. ఫిలిం మేకింగ్ పై వాళ్ళకున్న ఇష్టం వల్లే ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. నా ఉద్దేశం, సినిమాపై అంత ఫ్యాషన్ ఉండడం వల్లే వాళ్ల నుంచి స్థిరంగా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి" అని అన్నారు. ఆ తర్వాత 'జవాన్' సెట్స్ లో షారుఖ్ ఖాన్ తనకు ఓ సలహా కూడా ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

"జవాన్ షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్ లో నేను షారుక్ ఖాన్ ని కొన్ని ప్రశ్నలు అడిగే దానిని. ఒకానొక సమయంలో నేను చాలా విషయాల్లో ఓవర్ థింకింగ్ చేస్తున్నానని షారుక్ సర్ కనిపెట్టి, 'మీ మనసు ఏం చెప్తుందో అదే వినండి. ఎక్కువగా ఆలోచించకండి' అని చెప్పారు. ఆయన ఒకసారి అలా చెప్పినప్పటి నుంచి నేను ఓవర్ థింకింగ్ చేయడం ఆపేసి, నా మనసు ఏం చెప్తుందో అదే చేశాను. అది నాకు చాలా హెల్ప్ అయింది" అని సానియా మల్హోత్ర చెప్పుకొచ్చింది. కాగా 'జవాన్' సినిమాలో 'డాక్టర్ ఈరం' అనే పాత్రను పోషించింది సానియా మల్హోత్రా. ఆమెతోపాటు ప్రియమణి, గిరిజ ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి కీలక పాత్రలు పోషించారు.

సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. సినిమాలో షారుక్ సరసన నయనతార హీరోయిన్గా నటించగా, కోలీవుడ్ విలక్షణ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మెప్పించారు. అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే, సంజయ్ దత్ క్యామియో రోల్స్ తో ఆకట్టుకున్నారు. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అయితే సినిమాలో షారుక్ ఖాన్ స్టైల్, స్వాగ్, యాక్షన్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read : ప్రౌడ్ సే సింగిల్, ఇది భీమ్స్ బీట్ - ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'లో సాంగ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Tamilsai Arrest: తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
Tejasvi Surya Wedding: స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి -  ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి - ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Tamilsai Arrest: తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
Tejasvi Surya Wedding: స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి -  ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
స్టార్ సింగర్‌తో బీజేపీ యువ ఎంపీ తేజస్వి సూర్య పెళ్లి - ప్రముఖుల సందడి మామూలుగా లేదుగా !
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
Elon Musk Punjab Son: ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Embed widget