By: ABP Desam | Updated at : 28 Jul 2023 01:38 PM (IST)
జైలర్ Vs జైలర్(Image Credits : Jailer/Twitter)
Jailer Vs Jailer: సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం 'జైలర్' గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. నిన్నటిదాకా ఈ సినిమాలోని కావాలా సాంగ్ తో ట్రెండింగ్ లో నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు ఓ వివాదాస్పద వార్తతో ముందుకొచ్చింది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణన్, తమన్నా భాటియా, వినాయకన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ అతిథి పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇదే పేరుతో మరో మలయాళ చిత్రం కూడా అదే రోజు విడుదలవుతుండడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ నటించగా.. ఈ సినిమాకు సక్కీర్ మదతిల్ దర్శకత్వం వహించారు.
మదతిల్.. 'జైలర్' టైటిల్‌ను తానే మొదట రిజిస్టర్ చేశానని, ఆల్టర్నేట్ చూసుకోవాలని రజనీకాంత్‌ను అభ్యర్థించినట్లు పేర్కొన్నాడు. అయితే, సన్ పిక్చర్స్ అందుకు తిరస్కరించి కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మదాతిల్ కౌంటర్ దాఖలు చేశారు. కాగా దీనిపై ఆగస్టు 2న విచారణ జరగనుంది.
ఈ గొడవపై స్పందించిన మదతిల్.. "జైలర్ చేయడానికి మొత్తం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను. ఈ సినిమా కోసం నా ఇల్లు, నా కుమార్తె నగలను తాకట్టు పెట్టాను. నా కారును కూడా అమ్మేశాను. అంతే కాకుండా బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకున్నా.. వడ్డీ కట్టడం కష్టమే అయినప్పటికీ బయటి నుంచి అప్పు కూడా తీసుకున్నా. రజనీకాంత్ మంచి వ్యక్తి, నా కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. నా భవిష్యత్తంతా 'జైలర్'తోనే ఉంది. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"A total of 5 crore rupees was spent to make #Jailer.
I have mortgaged my house and my daughters jewellery. I have sold the car. I have taken loan from bank and I have also taken loan from outside. Paying interest is difficult.#Rajinikanth is a good person, he will understand… pic.twitter.com/yEalohAGL5— Manobala Vijayabalan (@ManobalaV) July 26, 2023
ఇదిలా ఉండగా రజనీకాంత్, తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించనున్న 'జైలర్'ను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించాడు. ప్రస్తుతం ఈ సినిమా కథాంశాన్ని మేకర్స్ సస్పెన్స్ లోనే ఉంచారు. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నటిస్తోన్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, పనిచేసే అవకాశం లభించడం అదృష్టం, ఆశీర్వాదం అని ఇటీవలే తెలిపారు. ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేసిన తమన్నా.. "అతని (రజనీకాంత్)తో కలిసి పనిచేయడంతో ఒక కల నిజమైంది. జైలర్ సెట్‌లో గడిపిన జ్ఞాపకాలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. అతను నాకు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చాడు. అతని నా గురించి చాలా ఆలోచించాడు. దానికి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు" అని తమన్నా పేర్కొంది. ఇకపోతే 'జైలర్'ను ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also : ‘బేబీ’ రీమేక్ రైట్స్‌కు ఊహించని డిమాండ్ - మేకర్స్ ముందు భారీ ఆఫర్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్.. జయహో శుభ్‌మన్! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
/body>