Jaanvi Swarup First Hero: మహేష్ మేనకోడలు ఫస్ట్ హీరో ఎవరు? కూతురి మొదటి సినిమాకు డిఫరెంట్ స్ట్రాటజీతో మంజుల!
Jaanvi Swarup Debut Movie Details: సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకీ, ఆవిడ మొదటి సినిమాలో హీరో ఎవరు? ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిబడుతున్నది ఏమిటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, నటి - దర్శక నిర్మాత మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Ghattamaneni) అతి త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీదకు అమ్మాయి వస్తుందని అనౌన్స్ చేశారు. మరి, ఆ సినిమాలో హీరో ఎవరు? జాన్వీ స్వరూప్ పుట్టినరోజు (అక్టోబర్ 29న) ఆమె ఎంట్రీ డిస్కషన్ టాపిక్ అయ్యింది. అయితే ఎవరి జంటగా ఆ అమ్మాయి స్క్రీన్ మీదకు వస్తుంది? అనేది బయటకు రాలేదు. ఆ విషయంలోకి వెళితే...
కూతురి డెబ్యూకు మంజుల డిఫరెంట్ ప్లాన్!
వెండితెరకు అమ్మాయిని కథానాయికగా పరిచయం చేసే విషయంలో మంజుల ఘట్టమనేని డిఫరెంట్ స్ట్రాటజీ రెడీ చేశారట. పేరున్న హీరో సినిమాలో కాకుండా ఓ కొత్త హీరో సినిమాతో జాన్వీ స్వరూప్ (Jaanvi Swarup Debut Movie Hero)ను ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారట.
స్టార్ హీరో అయితే అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అభిమానులతో పాటు ప్రేక్షకుల చూపు హీరో మీద ఉంటుంది. కొత్త హీరో అయితే అతనితో పాటు హీరోయిన్ మీద కూడా ప్రేక్షకుల చూపు పడుతుంది. అందుకని కొత్త హీరో సినిమాతో అమ్మాయిని పరిచయం చేయాలని మంజుల ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.
Also Read: ఓటీటీలోకి కల్యాణీ ప్రియదర్శన్ 'కొత్త లోక'... టోటల్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
జాన్వీ స్వరూప్ ఆల్రెడీ ఓ సినిమా చేశారు. తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది'లో బాల నటిగా కనిపించారు. కెమెరాను ఫేస్ చేయడం ఆమెకు కొత్త కాదు. కథానాయికగా పాటలు, డ్యాన్సులు ఎలా చేస్తుంది? అనేదానితో పాటు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలో నటన ఏ విధంగా ఉంటుంది? అనేది చూడాలి. సినిమా అంటే ముందు గోల్డ్ జ్యువెలరీ యాడ్ ఒకటి జాన్వీ చేశారని తెలిసింది. త్వరలో ఆ యాడ్ రిలీజ్ కానుంది.
ఇప్పటి వరకు కృష్ణ - మహేష్ బాబు కుటుంబం నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. మంజుల వచ్చినా ఆవిడ నటిగా చేశారు తప్ప పూర్తి స్థాయిలో కమర్షియల్ నాయికగా చేయలేదు. అందువల్ల జాన్వీ స్వరూప్, రమేష్ బాబు కుమార్తె భారతి మీద కృష్ణ ఫ్యామిలీ ఫ్యాన్స్ - ఆడియన్స్ చూపు ఉంది. అందరూ వాళ్ళ హీరోయిన్ డెబ్యూ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Also Read: అప్పుడు అమ్మను రానివ్వలేదు... ఇప్పుడు కూతుర్ని మహేష్ ఫ్యాన్స్ వద్దంటారా?





















