Ravi Teja Nephew As Hero : రవితేజ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు
Ravi Teja Brother Raghu Son Maadhav Bhupathiraju To Introduce As Hero : మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. అతడి పేరు మాధవ్ భూపతిరాజు.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కుటుంబం నుంచి ఓ యువ కథానాయకుడు వస్తున్నాడు. అతడి పేరు మాధవ్ భూపతిరాజు (Maadhav Bhupathiraju). రవితేజ సోదరుడు రఘు కుమారుడు. రఘు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆర్టిస్టుగా చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు హీరోగా వస్తున్నారు. ఈ రోజు మాధవ్ భూపతిరాజు తొలి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న ఆ చిత్రానికి 'ఏయ్... పిల్లా' (Ey Pilla Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు.
Ey Pilla Movie First Look : ఈ రోజు (ఆగస్టు 9) నల్లమలుపు శ్రీనివాస్ (Nallamalupu Srinivas) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ... సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ (Rubal Shekhawat) కథానాయిక. హీరోతో పాటు ఆమెకూ ఇది తొలి చిత్రమే.
'ఏయ్... పిల్లా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... హీరో హీరోయిన్లు ఇద్దరూ పీకల్లోతు నీటిలో ఉన్నారు. బహుశా... వాళ్ళు అంతలా ప్రేమలో మునిగారని చెప్పడం కాబోలు. ఆ వెనుక చూస్తే... తాటి చెట్లు, టైటిల్ లోగోలో గాలిపటం ఉన్నాయి. వింటేజ్ ప్రేమ కథగా సినిమాను రూపొందిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆ వాతావరణం ప్రతిబింబించేలా చూసుకున్నారు.
సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
వచ్చే నెలలో 'ఏయ్... పిల్లా' సెట్స్ మీదకు వెళ్ళనుంది. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా, 90వ దశకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి ఉన్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మాధవ్ భూపతిరాజుకు గ్రాండ్ లాంచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నల్లమలుపు శ్రీనివాస్ ఈ సినిమా చేస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
Also Read : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే
రమేష్ వర్మ కథతో...
ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. రవితేజ 'వీర', 'ఖిలాడీ' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: ప్రసన్న, కళ : చిన్నా.
Also Read : 'ఎఫ్ 3' బాటలో 'బింబిసార' - నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడంటే?