అన్వేషించండి

Indian 2: ‘ఇండియన్ 2’లో ముందుగా సిద్ధార్థ్ ప్లేస్‌లో ఆ హీరో? పెద్ద డిజాస్టర్ తప్పించుకున్నాడంటున్న ప్రేక్షకులు

Indian 2: శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’లో సిద్ధార్థ్ సెకండ్ హీరోగా నటించాడు. కానీ ముందుగా ఈ పాత్రకు వేరే హీరోను అనుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Indian 2: ఒకప్పుడు మెసేజ్ ఓరియెంట్ కథకు భారీ బడ్జెట్‌ను జతచేసి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న దర్శకుడు శంకర్. కొన్నాళ్ల క్రితం శంకర్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది. ప్రీ బుకింగ్స్ విషయంలోనే ఆయన సినిమాలు వండర్స్ క్రియేట్ చేసేవి. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదురవ్వడంతో ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పోయింది. తాజాగా ఆయన తెరకెక్కించిన ‘ఇండియన్ 2’కు డిజాస్టర్ టాక్ రావడంతో పాటు చాలామంది దానిని ట్రోల్ కూడా చేశారు. అయితే ముందుగా ఈ మూవీలో సిద్ధార్థ్ చేసిన క్యారెక్టర్ కోసం మరో హీరోను పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్.

మిస్ చేసుకున్నాడు..

‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ హీరోగా నటించారు. తనతో పాటు సెకండ్ హీరోగా సిద్ధార్థ్.. మరో కీలక పాత్రలో కనిపించాడు. కానీ ఈ పాత్ర కోసం ముందుగా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్‌ను పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్. అయితే శివకార్తికేయన్ కాల్ షీట్స్ ప్రస్తుతానికి ఖాళీగా లేవు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండడంతో పాటు కొత్త కథలను ఎంచుకోవడంలో ఈ హీరో ఆసక్తి చూపిస్తున్నాడు. అలా పలు కారణాల వల్ల తను ‘ఇండియన్ 2’ను రిజెక్ట్ చేశారు. దీంతో ఈ అవకాశం సిద్ధార్థ్‌కు వచ్చింది. కమల్ హాసన్ లాంటి స్టార్‌తో కలిసి నటించడం అదృష్టం అని భావించాడు సిద్ధార్థ్. కానీ ఆ అవకాశం వల్లే ఇప్పుడు ట్రోల్స్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రమోషన్స్‌లో హైలెట్..

‘ఇండియన్ 2’ను ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగానే ప్రమోషన్స్ జరిగాయి. అన్నింటిలో కమల్ హాసన్, శంకర్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. కానీ అందరికంటే సిద్ధార్థే ఈ ప్రమోషన్స్‌లో హైలెట్‌గా నిలిచాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు దురుసుగా సమాధానాలు ఇస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. పలు ఈవెంట్స్‌లో కమల్ హాసన్‌ను సిద్ధార్థ్ కనీసం మాట్లాడనివ్వడం లేదంటూ తమిళ మీడియా తనను విమర్శిస్తూ వార్తలు కూడా ప్రసారం చేసింది. ఇదంతా చూస్తుంటే శివకార్తికేయన్ చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతున్నాడేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

పలుమార్లు పోస్ట్‌పోన్..

భారీ అంచనాల మధ్య ‘ఇండియన్ 2’ అలియాస్ ‘భారతీయుడు 2’ విడుదలయ్యింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు’.. 1996లో విడుదలయ్యింది. అప్పట్లోనే ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్ వస్తుంది అని ప్రకటించినప్పుడు కూడా ప్రేక్షకుల్లో దీనిపై పాజిటివ్ అభిప్రాయమే ఉంది. కానీ షూటింగ్ మొదలయినప్పటి నుండి ‘భారతీయుడు 2’కు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. దీంతో ఆడియన్స్‌లో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఫైనల్‌గా మూవీ విడుదలయ్యి డిజాస్టర్ టాక్ అందుకుంది.

Also Read: చైతూ, శోభితాపై కామెంట్స్ - వేణు స్వామికి మంచు విష్ణు వార్నింగ్? పోలీసు కేసు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Embed widget