Pragya Jaiswal: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ - మనసులో మాట బయట పెట్టిన 'అఖండ' హీరోయిన్
స్టార్ క్రికెటర్ తో డేటింగ్ గురించి ఎట్టకేలకు మనసులో మాట బయట పెట్టింది 'అఖండ' హీరోయిన్. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అంటూ ప్రగ్యా కామెంట్స్ చేసింది.
యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ... తాజాగా ప్రముఖ క్రికెటర్ శుభమాన్ గిల్ తో డేటింగ్ చేయాలని ఉంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
టీం ఇండియాలో తన బ్యాటింగ్ తో క్రేజీ స్టార్ గా, ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయిన యంగ్ క్రికెటర్ శుభమాన్ గిల్. తాజాగా హీరోయిన్ ప్రగ్యా ఓ ఇంటర్వ్యూలో అతనితో డేటింగ్ చేయాలనుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శుభమాన్ గిల్ తో ప్రేమాయణం గురించి ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ 'ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను. శుభమాన్ గిల్ క్యూట్ గా ఉంటాడు' అంటూ తెగ సిగ్గు పడింది. అంతేకాకుండా 'ఏది జరగాలని రాసి ఉంటే, అది జరుగుతుంది' అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. నిజానికి ఫస్ట్ మూవీ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రగ్యా నటించిన సినిమాలేవీ హిట్ కాకపోవడంతో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చేసిన 'అఖండ' సినిమా మాత్రం ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలాంటి హిట్ మూవీ పడ్డాక కూడా ప్రగ్యాకి తెలుగులో అవకాశాలు రాలేదు. త్వరలోనే ఈ బ్యూటీ 'అఖండ' సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న 'అఖండ 2'లో కూడా నటించబోతోంది. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు, సిరీస్ లు చేస్తూ, ఓవైపు సౌత్ మరోవైపు నార్త్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ప్రగ్యా జైస్వాల్.
రీసెంట్ గా ఈ బ్యూటీ 'ఖేల్ ఖేల్ మే' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, వాణి కపూర్, తాప్సీ పన్నులతో కలిసి ప్రగ్యా స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రముఖ క్రికెటర్ శుభమాన్ గిల్ తో ప్రేమలో ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ క్రమంలోనే గిల్ గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీరిద్దరి పెళ్లి జరుగుతుందా అంటే అనుమానమే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే గతంలో శుభమాన్ గిల్... సారా అలీ ఖాన్, సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో పాటు మరికొంత మంది హీరోయిన్లతో ప్రేమలో పడినట్టు వార్తలు వినిపించాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. మరి ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?