Game Changer Postponed: క్రిస్మస్‌కి రామ్ చరణ్ వెనక్కి తగ్గితే... నితిన్, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ రెడీ
Robinhood Release Date: 'గేమ్ ఛేంజర్'ను క్రిస్మస్ బరిలో విడుదల చేస్తామని 'దిల్' రాజు చెప్పినా... కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందుకని, నితిన్ కొత్త సినిమా, ఎన్టీఆర్ బావమరిది సినిమా రెడీ అవుతున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). క్రిస్మస్ బరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. డిసెంబర్ 20న విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే... దర్శకుడు శంకర్ పని తీరు మీద తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరికి అనుమానాలు ఉన్నాయి. ప్యాచ్ వర్క్, రీ షూట్స్ అంటూ షూటింగ్ డేస్ పెంచుతూ వెళుతుండటంతో 'దిల్' రాజు అనుకున్న తేదీకి సినిమా బయటకు వస్తుందా? లేదా? అని కొంత మందిలో సందిగ్ధ స్థితి నెలకొంది.
'గేమ్ ఛేంజర్' వాయిదా పడితే? అప్పుడు ఏంటి?
'గేమ్ ఛేంజర్' సినిమా వాయిదా పడితే... ఒకవేళ అనుకున్న సమయానికి సినిమా రెడీ కాకపోతే... అప్పుడు ఏంటి? హాలిడేస్ ఉన్న మంచి క్రిస్మస్ సీజన్ ఖాళీగా ఉంటుంది. అది క్యాష్ చేసుకోవడానికి రెండు తెలుగు సినిమాలు యమా స్పీడుగా రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి నితిన్ సినిమా కాగా... మరొకటి ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా.
నితిన్ కథానాయకుడిగా భీష్మ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తరువాత ఆయనతో మరోసారి యువ దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న సినిమా 'రాబిన్ హుడ్' (Robinhood Telugu Movie). ఇందులో శ్రీ లీల హీరోయిన్. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ బరిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... రామ్ చరణ్ సినిమా రావడంతో వాయిదా వేసుకున్నారు. దీంతో పాటు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'తండేల్' కూడా వాయిదా పడింది. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' వాయిదా పడొచ్చు అనే గుసగుసలు నేపథ్యంలో వీలైతే క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి సినిమాను చక చక రెడీ చేస్తున్నారు.
క్రిస్మస్ బరిలో విడుదలకు రెడీ అవుతున్న మరో హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరో. 'మ్యాడ్' సినిమాతో ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 'ఆయ్' చేశారు. ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. 'మ్యాడ్' సక్సెస్ తర్వాత 'మ్యాడ్ 2' స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాను వీలయితే క్రిస్మస్ బరిలో విడుదల చేయాలని రెడీ అవుతున్నారు.
Also Read: తమిళంలో సినిమా చేసి తెలుగులో డబ్బింగ్ చేద్దాం - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్
డిసెంబర్ కాకపోతే మార్చిలో చరణ్ సినిమా?
ఇప్పటి వరకు 'గేమ్ ఛేంజర్' విడుదల వాయిదా పడిందని యూనిట్ సభ్యుల నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. వాయిదా పడొచ్చు అనేది ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ వాయిదా పడితే మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వినాయక చవితికి సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల అయ్యింది. రెండో పాటను ఈ నెలలో విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఆ సాంగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు.
Also Read: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

