Jr NTR - Vetrimaaran: తమిళంలో సినిమా చేసి తెలుగులో డబ్బింగ్ చేద్దాం - కోలీవుడ్ దర్శకుడికి ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్
Devara Chennai Press Meet: 'దేవర' ప్రచార కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ చెన్నై వెళ్లారు. అక్కడ తమిళంలో తనకు ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. సభ ముఖంగా దర్శకుడికి రిక్వెస్ట్ కూడా చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమ, తమిళ చిత్ర పరిశ్రమ అని వేరు చేసే రోజులు 'బాహుబలి' తర్వాత పోయాయని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్నారు. మనం మాట్లాడే భాషలు వేరు అయినప్పటికీ... మన అందరిని సినిమా ఒక్కటి చేసిందని, ఏకతాటిపై నిలుపుతోందని ఆయన చెన్నైలో చెప్పారు. ఈ నెల 27న 'దేవర' ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సందర్భంగా మంగళవారం చెన్నైలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది చిత్ర బృందం. తమిళ మీడియా నుంచి తమ భాషలో సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?
వెట్రిమారన్ గారు... నాతో సినిమా చేయండి!
తమిళ దర్శకుడు వెట్రిమారన్ అంటే తనకు ఎంతో అభిమానం అని ఎన్టీఆర్ తెలిపారు. ఆయన ఎప్పుడు సినిమా చేస్తానంటే అప్పుడు తాను సిద్ధమని కూడా వివరించారు. పబ్లిక్ స్టేజ్ మీద ఎన్టీఆర్ మరొక ఆఫర్ కూడా ఇచ్చారు. తమిళంలో సినిమా తీసి తెలుగులో డబ్బింగ్ చేద్దామని వెట్రిమారన్ (Vetrimaaran)కి సూచించారు.
ఎన్టీఆర్, వెట్రిమారన్ కలిసి ఒక సినిమా చేస్తారని ఇప్పుడు కాదు... ఎప్పటి నుంచో వినబడుతోంది. ఫిబ్రవరి 2023లో ఒకసారి ఆ వార్త సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయింది. ధనుష్ ఎన్టీఆర్ కథానాయకులుగా వెట్రిమారన్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే... శివ కొరటాల దర్శకత్వంలో అప్పటికే దేవర చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పారు.
తమిళ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో తీసిన 'విడుదల' సినిమా ప్రచార కార్యక్రమాల కోసం వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ సినిమా గురించి ఆయనకు ప్రశ్న ఎదురయింది.
కరోనా తరువాత తాను హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ (Jr NTR Vetrimaaran Movie)ని కలిసినట్టు వెట్రిమారన్ చెప్పారు. తన మేకింగ్ స్టైల్ భిన్నంగా ఉంటుందని, ఒక సినిమా చేసిన తర్వాత మరొక సినిమా కథ పైకి వెళ్లడం తన అలవాటు అని, తమ ఇద్దరం కలిసి ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అప్పట్లో కుదరలేదని ఆయన వివరించారు. అదీ సంగతి! ఇప్పుడు బాల్ వెట్రిమారన్ కోర్టులో ఉంది. ఎన్టీఆర్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్ మీద ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అభిమానుల బలమైన కోరికతో 'దేవర'కు సంగీతం
'దేవర' చిత్రానికి తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో విలేకరుల సమావేశానికి ఆయన కూడా వచ్చారు. స్టేజి మీద పాట పాడి అందరినీ అలరించారు. ఆ తరువాత తాను ఈ సినిమాలోకి ఎలా వచ్చిందీ వివరించారు. ''దేవర సినిమా గురించి వివరాలు వెళ్లడైన తరువాత ట్విట్టర్ వేదికగా అభిమానులు నేను సంగీతం అందించాలని ట్రెండ్ చేశారు. అలా ఈ సినిమాతో నా ప్రయాణం మొదలు అయింది. నాకు హైదరాబాదు నగరంలో ఉన్న సన్నిహిత మిత్రుడు ఎన్టీఆర్ అన్న'' అని అనిరుద్ తెలిపారు.