Meher Ramesh : పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ - ఎప్పటికైనా సినిమా చేసి తీరుతా, మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్!
Meher Ramesh : తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని, ఇప్పటికే తన దగ్గర స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని తెలిపాడు.
Meher Ramesh On Pawankalyan : టాలీవుడ్ ప్లాప్ చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా చేసిన కామెంట్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారుతున్నాయి. టాలీవుడ్‌లో తమ సినిమాలతో డైరెక్టర్ గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఫిలిం మేకర్స్ మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఒకరిని చెప్పొచ్చు. కెరియర్ స్టార్టింగ్ లో ఈయన తెరకెక్కించిన 'బిల్లా' మూవీకి సపరేట్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ప్రభాస్‌ను చూపించిన విధానం, మెహర్ రమేష్ టేకింగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
దాంతో కచ్చితంగా ఫ్యూచర్లో మెహర్ రమేష్ స్టార్ డైరెక్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ డైరెక్టర్ చేసే సినిమాలు టాలీవుడ్ లో ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నాయి. దీంతో చాలా సంవత్సరాల పాటు డైరెక్షన్ జోలికి వెళ్లలేదు మెహర్ రమేష్. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన 'భోళా శంకర్' కూడా డిజాస్టర్ అవడంతో దర్శకుడిగా ఈయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో మెహర్ రమేష్ ని చాలా మంది ట్రోల్ కూడా చేశారు. దాంతో డైరెక్టర్ గా మెహర్ రమేష్ పై ఆడియన్స్ లో నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది. అలాంటి ఈ డైరెక్టర్ ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చాడు.
'భోళా శంకర్' డిజాస్టర్ అవడంతో మీడియాలో కానీ ఇతర ఈవెంట్లలో కానీ ఎక్కడా కనిపించని మెహర్ రమేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరోజు తాను పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని, కచ్చితంగా ఎప్పటికైనా ఆ సినిమా చేసి తీరుతానని అన్నాడు. అంతేకాకుండా తన దగ్గర పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న ఓ కథ ఎప్పటినుంచో ఉందని, స్క్రిప్ట్ కూడా రెడీ చేశానని, కచ్చితంగా ఆ కథతో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి సినిమా చేస్తానని మెహర్ రమేష్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కామెంట్స్ విన్న పవన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
‘‘మెహర్ అన్న ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు అంటే అన్నంతపని చేస్తాడేమో’’, ‘‘అన్నయ్య చిరంజీవి అయిపోయాడు.. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ మిగిలి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ తో సినిమానా వద్దు బాబోయ్’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడిగా ఫెయిల్ అవ్వొచ్చేమో గాని వ్యక్తిగతంగా చాలా మంచివాడని ఇండస్ట్రీ పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి మెహర్ రమేష్ ఎంతో సన్నిహితుడు. అందుకే దర్శకుడిగా వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న మెహర్‌కు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు చిరు. కానీ ఆ అవకాశాన్ని మెహర్ రమేష్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో పవన్‌తో కచ్చితంగా సినిమా చేసి తీరుతా అంటున్నాడు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply