అన్వేషించండి

Vijay Rashmika: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!

విజయ్ దేవరకొండ, రష్మిక కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదని.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులకు ఎప్పటినుంచో అనుమానం ఉంది. అది నిజమేనేమో అనిపించేలా తాజాగా ఇద్దరు ఒకే రకమైన షర్ట్‌లో కనిపించారు.

సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ విషయాలు ఎక్కువరోజులు దాగి ఉండలేవు. ఒకవేళ ఒక హీరో, హీరోయిన్ ప్రేమలో ఉంటే.. ఆ విషయం ఏదో ఒక విధంగా కచ్చితంగా బయటికొస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక విషయంలో కూడా అదే జరుగుతోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మాత్రమే కాకుండా కలిసి కూడా ఉంటున్నారని కొంతకాలంగా సినీ పరిశ్రమలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది నిజమే అనిపించేలా వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న దాదాపు అన్ని ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ ఒకే విధంగా ఉంటోంది. ఇక తాజాగా ఇద్దరూ ఒకే షర్ట్ వేసుకొని కనిపించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు.

అక్కడ రష్మిక.. ఇక్కడ విజయ్..
ప్రస్తుతం రష్మిక.. తన అప్‌కమింగ్ మూవీ ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా గడిపేస్తోంది. ఈ సినిమా హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా విడుదల అవుతుండడంతో ప్రతీ రాష్ట్రానికి వెళ్తూ తమ సినిమాను చూడమని మూవీ టీమ్ ప్రమోట్ చేస్తోంది. అదే విధంగా నవంబర్ 30న ‘యానిమల్’ ప్రమోషన్స్ కోసం ముంబాయ్‌లో ల్యాండ్ అయ్యింది రష్మిక. ముంబాయ్‌లో రష్మిక వేసుకున్న షర్ట్.. ఇక్కడ హైదరాబాద్‌లో విజయ్ దేవరకొండ వేసుకున్న షర్ట్‌తో మ్యాచ్ అయ్యింది. నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్ జరుగుతుండగా.. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి విజయ్ దేవరకొండ వచ్చాడు. ఆ సమయంలో విజయ్ కూడా రష్మిక వేసుకున్న షర్ట్‌నే వేసుకున్నాడు. దీంతో నెటిజన్స్ మరోసారి ఈ జంట దొరికిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు.

‘రౌడీ’ బ్రాండ్‌కు ప్రమోషన్..
మరోవైపు అక్కడ విజయ్, ఇక్కడ రష్మిక ఒకే షర్ట్ వేసుకోవడానికి తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలనుకోవడం కూడా కారణం అయ్యుండవచ్చని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. విజయ్‌కు ఇప్పటికే తన సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. అదే ‘రౌడీ’. అయితే కొంతకాలం ఈ రౌడీ వేర్‌కు బ్రేక్ ఇచ్చిన విజయ్.. మళ్లీ కొత్తగా ప్రారంభిస్తున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని రష్మిక కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇప్పుడు రష్మిక, విజయ్ వేసుకున్న షర్ట్స్ కూడా రౌడీ బ్రాండ్‌కు సంబంధించినవే. అయితే వీరిద్దరూ ఒకే షర్ట్‌తో కనిపిస్తే.. నెటిజన్ల చూపులన్నీ తమపైనే ఉంటాయి కాబట్టీ రౌడీ వేర్‌కు ఇంతకంటే పెద్ద ప్రమోషన్ ఉండదు. దీంతో రౌడీ హీరో తన బ్రాండ్ ప్రమోషన్‌ను గట్టిగానే ప్లాన్ చేశాడని అనుకుంటున్నారు కొందరు నెటిజన్స్.

‘ఫ్యామిలీ స్టార్’తో రష్మిక..
ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక, రణబీర్ కపూర్‌తో కలిసి నటించిన సినిమా ‘యానిమల్’ డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతున్న ఈ సినిమాకు హిందీలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ప్రీ బుకింగ్స్ జరిగాయి. సందీప్ రెడ్డి వంగాకు తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ ఉండడంతో అటు హిందీలో, ఇటు తెలుగులో ఈ మూవీ చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో కూడా రష్మిక.. గెస్ట్ రోల్ చేస్తుందని మరో ప్రచారం కూడా సోషల్ మీడియాలో సాగుతోంది. కానీ ఎన్నిసార్లు అడిగినా.. విజయ్, రష్మిక మాత్రం వారు కేవలం ఫ్రెండ్స్ అనే చెప్తున్నారు. వారి రిలేషన్‌షిప్‌ను రివీల్ చేయడానికి స్పెషల్ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Also Read: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget