Animal Box Office: 'యానిమల్' బాక్సాఫీస్ రికార్డులు - మొదటి రోజు రణబీర్ సెంచరీ కొడతాడా?
Animal movie first day collection expected box office preview: 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అని అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే అర్థం అవుతోంది.
Animal movie opening day collection: 'యానిమల్' సినిమా విడుదలకు ఇంకా ఎంతో సమయం లేదు. విదేశాల్లో ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో పడతాయి. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడం, టీజర్ & ట్రైలర్‌లలో యాక్షన్ డోస్ ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేయడంతో సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మరి, సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి? సినిమాకు ఓపెనింగ్స్ ఎంత రావచ్చు? అని ఒకసారి చూస్తే...
హిందీలో మొదటి రోజు 55 కోట్ల గ్రాస్!
రణబీర్ కపూర్ కెరీర్ చూస్తే... 'సంజు', 'బ్రహ్మాస్త్ర' వంటి భారీ విజయాలు ఉన్నాయి. అయితే... అవి మాస్ ఫిలిమ్స్ కావు. కంటెంట్ బేస్డ్ క్లాస్ ఫిలిమ్స్. 'యానిమల్'కు వస్తే అవుట్ అండ్ అవుట్ సందీప్ రెడ్డి వంగా స్టైల్ కమర్షియల్ ఫిల్మ్. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాల్లో సినిమాలో మాంచి మాస్ కంటెంట్ ఉందని ప్రేక్షకుల్లో నమ్మకం కలిగింది. అందుకు తగ్గట్లు బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.
Animal movie hindi collection gross nett on first day: 'యానిమల్' హిందీ వెర్షన్ షోస్ ద్వారా 50 నుంచి 55 కోట్ల రూపాయల గ్రాస్ రావచ్చని ఓ అంచనా. మాస్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ బావుంటాయి. 'యానిమల్'కు మల్టీప్లెక్స్ థియేటర్లలో సైతం బావున్నాయి. పీవీఆర్, ఐనాక్స్ స్క్రీన్లలో రెండున్నర లక్షల టికెట్స్ అమ్మారు. కేవలం వాటి ద్వారా సుమారు ఏడున్నర కోట్ల వరకు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు గ్యారంటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం 'యానిమల్' అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. తెలుగులో మొదటి రోజు పది కోట్ల రూపాయలు రావచ్చని ఓ అంచనా. ఒక్క హైదరాబాద్ సిటీలో ఫస్ట్ డే కలెక్షన్స్ మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఉంటాయని టాక్.
#Animal Opening Day Expectation💥
— Sacnilk Entertainment (@SacnilkEntmt) November 29, 2023
Final Advance Gross: 33 Cr [India]
➡️Hindi: 55 Cr Gross
➡️Telugu: 10 Cr Gross
➡️ Overseas: 30 Cr Gross
Worldwide Gross: 95 Cr Gross💥
Note: with WOM, it will vary.
హైదరాబాద్ సిటీలో మొదటి రోజు 'యానిమల్' సినిమా షోలు సుమారు 600 వరకు పడుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి షోస్ వేస్తున్నారు. వాటిలో 390 వరకు హౌస్ ఫుల్స్ అయ్యాయి.
విదేశాల్లో 'యానిమల్' రికార్డులు... 30 కోట్లు?
Animal Movie Overseas Collections On Day 1: విదేశాల్లో 'యానిమల్' రికార్డ్ ఓపెనింగ్స్ సాధించడం ఖాయమని అర్థం అవుతోంది. మొదటి రోజు ఈ సినిమాకు 30 నుంచి 35 కోట్ల రూపాయలు వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
Animal worldwide collection day 1: ప్రపంచవ్యాప్తంగా 'యానిమల్'కు మొదటి రోజు 95 కోట్లు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరి, ఈ సినిమా సెంచరీ కొడుతుందా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే... సెంచరీ కొట్టడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. 'యానిమల్'తో రణబీర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల రేసులో నిలబడినట్లు చెప్పవచ్చు.