హైదరాబాద్‌లో భారీ వర్షాలు, అనుకోని వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ 13న జరగాల్సిన తమన్ 'ఓజీ టూర్' మ్యూజికల్ కాన్సర్ట్ రద్దు చేయబడింది.
Thaman OG Tour Cancelled: హైదరాబాద్ రెయిన్స్ ఎఫెక్ట్... తమన్ ఓజీ టూర్ క్యాన్సిల్
Hyderabad Rains Today: హైదరాబాద్ సిటీలో వర్షాలు తమన్ అభిమానులను డిజప్పాయింట్ చేశారు. ఇవాళ జరగాల్సిన ఓజీ టూర్ క్యాన్సిల్ అయ్యింది.

- తమన్ 'ఓజీ టూర్' హైదరాబాద్ కచేరీ భారీ వర్షాలతో రద్దయింది.
- 45 రోజుల శ్రమ వృథా కావడంతో తమన్ బృందం నిరాశ చెందింది.
- రద్దైన కార్యక్రమాన్ని త్వరలో తిరిగి నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman)కు వేసవి వర్షాలు షాక్ ఇచ్చాయి. ఆయన అభిమానులను డిజప్పాయింట్ చేశాయి. అనూహ్యంగా మే నెలలో హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల ప్రభావం తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ మీద పడింది.
'ఓజీ టూర్ ఇండియా విత్ తమన్' క్యాన్సిల్
OG Tour India With Thaman: తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 'ఓజీ టూర్ ఇండియా విత్ తమన్' ప్లాన్ చేశారు. మొదటి లైవ్ షో హైదరాబాద్ సిటీలో ఇవాళ (జూన్ 13న) జరగాలి. హైదరాబాద్ వర్షాల వల్ల, అనుకోని వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రోజు జరగాల్సిన మ్యూజికల్ కాన్సర్ట్ క్యాన్సిల్ అయ్యింది.
#OGTourIndia show which was supposed to happen today was cancelled due to heavy rains and a storm!! #Thaman pic.twitter.com/C642kt20Wo
— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) June 13, 2026
జూన్ 13వ తేదీ సాయంతం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో 'ఓజీ టూర్' (తమన్ మ్యూజికల్ కాన్సర్ట్) జరగాల్సి ఉంది. అయితే... హైదరాబాద్ సిటీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల అది క్యాన్సిల్ అయ్యిందని తమన్ ట్వీట్ చేశారు. అలాగే, నిర్వాహకులు సైతం కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు వెల్లడించారు.
It’s Heartbreaking for Me & My 56 Member Team
— thaman S (@MusicThaman) June 13, 2026
To Work on this #OgtourIndia .. from last 45 days Tirelessly Taking all the Feedback backs In A positive Manner
We as a Team Took all the Good Energy in this World to Make this Concert happen In a Positive Manner .
Sometimes It has…
ఓజీ టూర్ కోసం తన 56 మంది సభ్యుల బృందంతో కలిసి గత 45 రోజులుగా ఎంతో శ్రమించి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేశారమని, అయితే దేవుడి ప్లాన్ వేరేగా ఉందని, వర్షాల కారణంగా కాన్సర్ట్ క్యాన్సిల్ కావడంతో హార్ట్ బ్రేక్ అయినంత పని అయ్యిందని 'ఎక్స్' (ట్విట్టర్)లో తమన్ పోస్ట్ చేశారు. ''నేను ఎప్పుడూ దేవుడు, విధిని నమ్ముతాను. ఇప్పుడు మీ అందరి ప్రేమ, నమ్మకం నాకు చాలా అవసరం. ఓజీ కాన్సర్ట్ ఏ విషయంలోనూ తక్కువ కాదని నేను నిరూపిస్తాను. నా కమ్‌బ్యాక్‌లు ఎప్పుడూ మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు. జూన్ 13న 'ఓజీ టూర్' క్యాన్సిల్ అయినప్పటికీ... త్వరలో రీ షెడ్యూల్ చేయడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ టీమ్ వెల్లడించింది. అది ఎప్పుడు? అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read: Suriya - Prabhas: ప్రభాసే కాదు... సూర్య కూడా దొరికేశాడు... ఇద్దరూ సేమ్ మిస్టేక్ చేశారేంటి?
Before You Go
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Frequently Asked Questions
తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ ఎందుకు రద్దు అయ్యింది?
క్యాన్సిల్ అయిన తమన్ కాన్సర్ట్ పేరు ఏమిటి?
రద్దు అయిన మ్యూజికల్ కాన్సర్ట్ పేరు 'ఓజీ టూర్ ఇండియా విత్ తమన్'. ఇది తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు.
రద్దైన 'ఓజీ టూర్' కాన్సర్ట్ తిరిగి నిర్వహిస్తారా?
తమన్ టీమ్ ఈ కాన్సర్ట్‌ను త్వరలో రీ షెడ్యూల్ చేయడానికి అవకాశాలను పరిశీలిస్తోంది. దీని వివరాలు త్వరలో తెలియజేస్తారు.
'ఓజీ టూర్' కాన్సర్ట్ ఎక్కడ జరగాల్సి ఉంది?
ఈ కాన్సర్ట్ జూన్ 13వ తేదీ సాయంతం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో జరగాల్సి ఉంది.
ట్రెండింగ్ వార్తలు






















