News
News
X

Nani Dasara: ఆ సినిమాలతో ‘దసరా’కు పోలిక - నాని సమాధానం ఇది

నాని, కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూస్తూ ఉంటే ‘పుష్ప’, ‘రంగస్థలం’, ‘కేజీఎఫ్’ సినిమాలని పోలినట్లు ఉందంటూ వస్తున్న వార్తలపై నాని ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

FOLLOW US: 
Share:

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. సింగరేణి బొగ్గు గనుల సమీపంలో ఉండే ఒక చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. సింగరేణి లోకల్‌ ట్రైన్స్ నుంచి బొగ్గును దొంగిలించే పాత్రలో హీరో నాని కనిపించబోతున్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరూ డీ గ్లామర్ లుక్ లో కనిపించబోతున్నారని ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్‌ తో క్లారిటీ వచ్చింది. నాని సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఏడాదిలో అత్యధికంగా మాట్లాడుకునే సినిమాగా ‘దసరా’ నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి యూనిట్ సభ్యులు భారీగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘దసరా’ గురించి అభిమానులు నెటిజన్స్‌ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతానంటూ నాని ట్విట్టర్ లో ఆస్క్ నాని సెషన్ నిర్వహించారు. ఆ సందర్భంగా అభిమానులు, మీడియా వారు సినిమా గురించి పలు ప్రశ్నలు అడిగారు.

ఒక్కమాటతో తేల్చేసిన నాని

నాని లుక్, కథా నేపథ్యం గురించి ఎంతో మంది ప్రశ్నలు అడిగారు. ‘దసరా’ సినిమాలో మీ లుక్ ను చూస్తున్నప్పుడు పుష్ప, రంగస్థలం హీరోల పాత్రలు గుర్తుకొస్తున్నాయి, ఆ రెండు సినిమాలను పోలి ఈ సినిమా ఉంటుందేమో అనిపిస్తుంది. కొందరు నార్త్‌ ప్రేక్షకులు ‘కేజీఎఫ్‌’ తరహాలో ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలంటూ నెటిజన్‌ ట్వీట్ చేయగా నాని స్పందిస్తూ.. 'టెర్మినేటర్‌', 'డిడిఎల్‌జే' ఒకేలా ఉండవు, కానీ షారుఖ్‌ ఖాన్‌, ఆర్నాల్డ్‌ ఇద్దరూ ఆయా సినిమాల్లో జాకెట్‌ ధరిస్తారు అని సమాధానం ఇచ్చారు. చూడ్డానికి కాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నా సినిమాలు పూర్తి విభిన్నంగా ఉంటాయని ఒకే ఒక్క మాటతో నాని తేల్చి పారేశారంటూ సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ కు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాని నుంచి వచ్చిన సమాధానంతో గత కొన్ని రోజులుగా అభిమానుల్లో ఉన్న సస్పెన్స్ కు అనుమానాలకు తెర పడ్డట్లయ్యిందని కొందరు అంటున్నారు. 

నాని కెరీర్‌ లో ‘దసరా’ మొదటి పాన్ ఇండియా సినిమాగా నిలువబోతుంది. 'శ్యామ్‌ సింగరాయ్' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో సాధ్యం కాలేదు. ఈ సినిమాను నాని పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేయడం లేదు కానీ అన్ని భాషలకు కనెక్ట్‌ అయ్యే మంచి కంటెంట్‌ ఉన్నా సినిమా అని.. యూనివర్శిల్ సబ్జెక్ట్‌ తో రూపొందిన సినిమా అన్నట్లుగా పలు ప్రమోషనల్‌ ఈవెంట్స్ లో చెబుతున్నాడు. ‘దసరా’ సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కచ్చితంగా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు అవ్వబోతున్నాడని కూడా నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నార్త్ ఇండియాతో పాటు సౌత్‌ ఇండియా మొత్తం కూడా చుట్టేస్తూ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నాని పాల్గొంటున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ స్పందన వచ్చిందని, సినిమా కూడా తప్పకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. నాని, కీర్తి సురేష్ గతంలో కలిసి నటించిన చిత్రం 'నేను లోకల్‌' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా వీరి కాంబోకు మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. 

Also Read శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే

Published at : 16 Mar 2023 07:06 PM (IST) Tags: Pushpa Keerthy Suresh Dasara Nani

సంబంధిత కథనాలు

Orange Re-release Trailer: ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్, కొత్త ట్రైలర్ భలే డిఫరెంట్‌గా ఉందే!

Orange Re-release Trailer: ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్, కొత్త ట్రైలర్ భలే డిఫరెంట్‌గా ఉందే!

No No No Lyrical Song: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సాంగ్ - మూడేళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించిన అనుష్క, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

No No No Lyrical Song: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సాంగ్ - మూడేళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించిన అనుష్క, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Venkatesh's Saindhav Update : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?

Venkatesh's Saindhav Update : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

Actress Hema: ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన నటి హేమ

Actress Hema: ఆ టార్చర్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన నటి హేమ

టాప్ స్టోరీస్

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?