Honey Rose: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్
Rachel Teaser Review: 'వీర సింహారెడ్డి' సినిమాతో మలయాళ భామ హానీ రోజ్ పాపులారిటీ తెలుగులో పెరిగింది. గ్లామర్ ఇమేజ్ ఉన్న ఆవిడ ఇప్పుడు మాస్ యాక్షన్ రోల్‌తో 'రేచెల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Honey Rose New Movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమాతో తెలుగులో పాపులరైన మాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్. గతంలో ఆవిడ ఓ తెలుగు సినిమా చేసినప్పటికీ... బాలయ్య బాబు సినిమాతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. గ్లామర్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే... ఇప్పుడు గ్లామర్ లేడీగా కాకుండా యాక్షన్ చేయడానికి సిద్ధమైంది. హనీ రోజ్ కొత్త సినిమా 'రేచెల్' టీజర్ చూస్తే ఆడియన్స్ షాక్ అవ్వడం గ్యారంటీ.
చీకట్లో ఎరుపెక్కిన కళ్లు... కల కాదు!
మలయాళ భామ హనీ రోజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మాలీవుడ్ పాన్ ఇండియా సినిమా 'రేచెల్' (Rachel Movie). బాబు రాజ్, కళాభవన్ షాజోన్ ప్రధాన తారాగణం. బాదుషా ఎన్ ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆనందిని బాలా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు సహ రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ... ఐదు భాషల్లో టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?
'చీకట్లో నేను చూసిన ఆ ఎరుపెక్కిన కళ్లు... కల అయితే కాదు. అది కలే అయినా వాటిని (ఆ కళ్లను) నేను మర్చిపోను' - 'రేచెల్' టీజర్ ప్రారంభంలో వినిపించే వాయిస్ ఓవర్ ఇది. పెద్ద చెట్టు కింద గుడిసె లాంటి చిన్న షాపులో హనీ రోజ్ కనిపించారు. జనాలు అందరూ కాగడాలతో, లాంతరులతో ఆ కళ్లను వెతుకుతూ ఉన్నారు. ఆ తర్వాత నిస్తేజంగా ఉన్న హనీ రోజ్ కనిపించారు. అక్కడి వరకు సాధారణంగా ఉంది. ఆ తర్వాత అసలైన మాస్ మొదలైంది.
Also Read: అమలా పాల్ ఇంట వారసుడొచ్చాడు... వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్, పిల్లాడి పేరు ఏమిటంటే?
'ఎవరై ఉంటారు రేచెల్ అది?' అని మరొకరు హనీ రోజ్ (Honey Rose In Rachel)ను ప్రశ్నిస్తే... 'తెలియదు. వెతకాలి, చంపాలి' అంటూ సమాధానం ఇచ్చారు. ఇక, ఆ తర్వాత వచ్చిన దృశ్యాలు చూస్తే కత్తి పట్టి మనుషుల్ని వేటాడినట్టు తెలుస్తోంది. నెత్తిపై ఒక లైట్, చేతిలో కత్తి... హనీ రోజ్ మాస్ మామూలుగా లేదు.
Also Read: మీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!
హనీ రోజ్, బాబు రాజ్, కళాభవన్ షాజోన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'రేచెల్'లో రోషన్ బషీర్, చందు సలీం కుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ ఇతర కీలక తారాగణం. దీనికి రాహుల్ మణప్పట్టు కథను అందించగా... రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం: ఆనందిని బాల, నిర్మాతలు: బాదుషా ఎన్ఎం - రాజన్ చిరాయిల్ - బ్రిడ్ షైన్, సహ నిర్మాత: హన్నన్ మరముత్తం, స్క్రిప్ట్: రాహుల్ మనప్పట్టు - అబ్రిడ్ షైన్, ఛాయాగ్రహణం: స్వరూప్ ఫిలిప్, సంగీతం: ఇషాన్ ఛబ్రా, కూర్పు: మనోజ్.