అన్వేషించండి

Amala Paul: అమలా పాల్ ఇంట వారసుడొచ్చాడు... వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్, పిల్లాడి పేరు ఏమిటంటే?

Amala Paul Baby Boy Name: హీరోయిన్ అమలా పాల్ ఇంట వారసుడు వచ్చాడు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు. ఆ పిల్లాడికి పేరు కూడా పెట్టేశారు. ఆ పేరు ఏమిటంటే...

Amala Paul and Jagat Desai blessed with baby boy: కథానాయిక అమలా పాల్ పండంటి మగబిడ్డకు జన్మ ఇచ్చారు. ప్రస్తుతం తల్లితో పాటు బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆవిడ వెల్లడించారు. 

వారం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన అమల
జూన్ 8వ తేదీన అమలా పాల్ ఓ వీడియో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ''బేబీ కమ్ డౌన్... కమ్ డౌన్'' అని పాట పడే సమయం వచ్చిందని ఆవిడ పేర్కొన్నారు. ఆ వీడియోలో అమలా పాల్ నిండు గర్భిణీ అనేది స్పష్టంగా కనిపించింది. త్వరలో ఆవిడ డెలివరీ అవుతుందని నెటిజనులు ఊహించారంతా! అదే నిజం అయ్యింది. అయితే... వారం తర్వాత ఆవిడ గుడ్ న్యూస్ చెప్పారు. 

జూన్ 11న తనకు డెలివరీ అయ్యిందని అమలా పాల్ తెలిపారు. బహుశా... అప్పటి నుంచి ఆవిడ ఆస్పత్రిలో ఉన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చారు. బిడ్డతో పాటు ఇంట్లో అడుగుపెట్టిన వీడియోను అమలా పాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

పిల్లాడికి ఏం పేరు పెట్టారో తెలుసా?
Amala Paul named her baby boy as ILAI: వారసుడితో ఇంట అడుగు పెట్టిన అమలా పాల్... తన బిడ్డకు ఏం పేరు పెట్టారనేది కూడా చెప్పేశారు. చిన్నారికి 'ఇలయ్' (ILAI) అని నామకరణం చేశారు. ''అబ్బాయి పుట్టాడు. మా చిన్నారి, మా మిరాకిల్... 'ఇలయ్'ను చూడండి. జూన్ 11న జన్మించాడు'' అని అమలా పాల్ పేర్కొన్నారు. చిన్నారి ముఖం కనిపించకుండా ఆవిడ జాగ్రత్త పడ్డారు.

Also Read: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌ కంటే ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jagat Desai (@j_desaii)

చిన్నారి జననంతో జూన్ 6వ తేదీ, ఈ ఏడాది అమలా పాల్ జీవితంలో ఎప్పటికీ గుర్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఏడాది నవంబర్ 6న జగత్ దేశాయ్ (Jagat Desai)ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వివాహానికి పది రోజుల ముందు... అమలా పాల్ పుట్టినరోజు (అక్టోబర్ 26) నాడు తమ ప్రేమ విషయాన్ని జగత్ దేశాయ్ బయట పెట్టారు. ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత జనవరి 3న తాను గర్భవతి అని అమలా పాల్ ప్రపంచానికి చెప్పారు.

Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ - బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్... నెటిజనులకు ఆ మాత్రం తెలియదా?


తెలుగు ప్రేక్షకులకు కూడా అమలా పాల్ సుపరిచితురాలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ కథానాయికగా 'నాయక్'లో నటించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఆవిడ మెయిన్ హీరోయిన్. ఇంకా యువ సామ్రాట్ నాగ చైతన్య 'బెజవాడ'లో కూడా నటించారు. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తీసిన 'నాన్న'లో నటించిన సమయంలో ఆయనతో ప్రేమలో పడ్డారు. అది పెళ్లికి దారి తీసింది. కొన్నాళ్ల సంసార జీవితం తర్వాత విడాకులు తీసుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget