Sailesh Kolanu - Hit3 Leaks: 'హిట్ 3'లో కార్తీ.... లీక్స్‌పై దర్శకుడు గుస్సా... కష్టాన్ని దోచుకోవడమే అంటూ శైలేష్ కొలను ట్వీట్
Sailesh Kolanu : 'హిట్ 3' మూవీ విషయంలో లీక్స్ ఇస్తున్న జర్నలిస్ట్ లపై డైరెక్టర్ శైలేష్ కొలను అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేస్తూ కష్టాన్ని దోచుకుంటున్నారంటూ కామెంట్ చేశారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న మోస్ట్ అవైటింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3'. మే 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పనుల్లో చిత్ర బృందం తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలోనే మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ లీక్ అయ్యింది. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ లీక్ గురించి డిజప్పాయింట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేస్తూ మీడియా తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు.
బాధగా ఉందంటూ శైలేష్ కొలను పోస్ట్
డైరెక్టర్ శైలేష్ కొలను తాజాగా సోషల్ మీడియా వేదికగా తన సినిమా లీక్స్ గురించి స్పందించారు. ఆయన చేసిన పోస్ట్ లో "మన ప్రేక్షకులు థియేటర్లలో అనుభవించే ప్రతి ఎగ్జైటింగ్ మూమెంట్ కోసం చిత్ర బృందం పగలు, రాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తుంది. తమ శారీరక సామర్థ్యాలకు మించి కష్టపడి పని చేస్తుంది. ఇంత కష్టపడేది ఆడిటోరియంలో మేము క్రియేట్ చేయాలనుకునే ఆ ఎఫెక్టివ్ మూమెంట్ కోసం. అలా కష్టపడడం గురించి మేము గర్వపడుతున్నాము. కానీ నేటి మీడియా దుస్థితి విచారకరంగా ఉంది. కొంతమంది థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఎగ్జైట్ అవ్వడానికి ప్లాన్ చేసిన సర్ప్రైజ్ లను, వాటికి సంబంధించిన వివరాలను లీక్ చేసే ముందు ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ముందుగా రిపోర్ట్ చేయాలనుకునే మీ కర్తవ్యం గురించి మాకు తెలుసు. కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నవి లేకుండా ఏది పడితే అది లీక చేయకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ ఉండదా? చేసేముందు అది తప్పా? రైటా ? అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఒకప్పుడు గొప్ప విలువలతో కూడిన జర్నలిజం ఉండేది. సినిమాల గురించి ఎంతో తెలుసుకున్నప్పటికీ వాటిని అస్సలు బయట పెట్టకుండా దాచిన క్షణాలు కూడా ఉన్నాయి. ఇలా సినిమాకి సంబంధించిన లీక్స్ ఇవ్వడం అంటే చిత్ర బృందం కష్టాన్ని మాత్రమే దోచుకోవడం కాదు, ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ ను కూడా దొంగిలించడమే" అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
For every single moment of excitement that is experienced in the cinemas by our audience, there is a story of a huge team working relentlessly for days and nights together, slogging beyond their physical capabilities. All for that moment of impact that we want to create in the…
— Sailesh Kolanu (@KolanuSailesh) April 3, 2025
అసలేం జరిగిందంటే ?
'హిట్' ఫ్రాంచైజీలో మూడో భాగంగా రాబోతున్న మూవీ 'హిట్ 3'. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్ అంచనాలను భారీగా పెంచాయి. మే 1న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 'హిట్ 3' మూవీలో మరో స్టార్ హీరో క్యామియో రోల్ లో కనిపించబోతున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ విషయంపై డిజప్పాయింట్ అయిన శైలేష్ సోషల్ మీడియా వేదికగా జర్నలిజం ఎథిక్స్ ను ప్రశ్నిస్తూ... తమ కష్టాన్ని, ప్రేక్షకుల ఎగ్జయిట్మెంట్ ను దోచుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేశారు.





















