అన్వేషించండి

Alekhya Chitti Pickles: రేప్, మర్డర్ చేస్తారా? నాతో పాటు మా ఆయన్ను... ఏంటిది? అలేఖ్య చిట్టి పికిల్స్‌ కాంట్రవర్సీపై పెద్దక్క రియాక్షన్

Alekhya Chitti Pickles Controversy : అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో చెల్లి చేసిన అభ్యంతరకర కామెంట్స్ పై ఆమె అక్క సుమీ స్పందించింది. జరిగింది తాజాగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పచ్చళ్ల కాస్ట్ అంత ఎక్కువగా ఎందుకు పెట్టారు ? అన్న ఒకే ఒక్క ప్రశ్నకి అలేఖ్య చిట్టి పికిల్స్ కు సంబంధించిన ఓ అమ్మాయి బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ పంపిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంపై ట్రోలింగ్ మొదలైంది. కాస్ట్ అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇంత దారుణంగా తిడతారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు అసలు ఆ వాయిస్ ఒరిజినలేనా? ఇదంతా నిజమేనా? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అలేఖ్య చిట్టికి సంబంధించిన సిస్టర్స్ లో ఒకరు యూట్యూబ్ వేదికగా స్పందిస్తూ ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు. తనకు కూడా దీని గురించి ఏమాత్రం తెలియదని, తనను, తన ఫ్యామిలీని ఈ వివాదంలోకి లాగుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

అసలు వివాదం ఏంటంటే? 

అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడేవారు వీళ్ళ పికిల్స్ రుచి చూడకుండా వదిలిపెట్టరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలకు సైతం పచ్చళ్ళు ఆర్డర్ చేసి పంపించే అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ రాజమండ్రిలో జరుగుతుంది. వాళ్ళ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే తమ దగ్గర ఉన్న పచ్చళ్ళు, వాటి ధరలను వివరాలతో సహా పంపిస్తారు. వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉన్నాయని పేరు రావడంతో డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ తో పాటు రేటు కూడా ఓ రేంజ్ లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో రూ. 1200 నుంచి స్టార్ట్ కావడం గురించి ప్రశ్నించాడు. "మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కావడం లేదు" అంటూ రెండు చేతులు జోడించిన ఎమోజిని పంపాడు. దీంతో అటువైపు నుంచి ఓ అమ్మాయి దారుణమైన బూతులను తిడుతూ రిప్లై పంపింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయింది. ఫలితంగా నెటిజన్లు అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఆటాడుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ట్రోలింగ్ కారణంగా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను సైతం డిలీట్ చేశారు. అలాగే ఇన్స్టాలో కొత్త రిక్వెస్ట్లను స్వీకరించట్లేదు. వీళ్ళ వెబ్సైట్ కూడా ఓపెన్ కావట్లేదు. మొత్తానికి టెంపరరీగా అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం క్లోజ్ అయ్యింది. 

వివాదంపై సిస్టర్ రియాక్షన్ 

ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అలేఖ్య చిట్టి పేరుతో పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉండడంతో బిజినెస్ బాగానే జరుగుతుంది. ఈ క్రమంలోనే వీరిలో చెల్లెలు సోషల్ మీడియా వేదికగా చేసిన అభ్యంతరకర కామెంట్స్, దానిపై వస్తున్న ట్రోలింగ్ పై అక్క స్పందించింది. సుమీ యూట్యూబ్ ను నడుపుతున్న ఆమె ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో అసలు ఈ వివాదం గురించి తనకు తెలియదని, అసలేం జరిగిందో తెలియనప్పుడు ఎలా మాట్లాడుతానని తిరిగి ప్రశ్నించింది. తన సిస్టర్ కి ఫోన్ చేసి అడిగితే రెండు రోజుల వరకు తనతో మాట్లాడొద్దని చెప్పి బాధగా ఫోన్ పెట్టేసిందని, అయితే ఈ వివాదంతో తనకేంటి సంబంధం ? అని అడిగింది. అనవసరంగా ఈ వివాదంలోకి తనను, తన ఫ్యామిలీని లాగుతున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. తన చెల్లి చేసింది తప్పేనని ఒప్పుకున్న ఆవిడ... వీళ్లను ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తాము, రేప్ చేస్తాము అని వస్తున్న బెదిరింపు కామెంట్స్ ను లైక్ చేస్తున్నవారు ఏం చెప్పాలనుకుంటున్నారని ఫైర్ అయ్యింది. తన భర్త ఫోటోలు వాడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget