వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ఫిక్స్? వెడ్డింగ్ ప్లానర్ సైతం రెడీ!
మరికొద్ది రోజుల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అయితే అందుకు వారు తాజాగా వెడ్డింగ్ ప్లానర్లను నియమించుకున్నట్టు తెలుస్తోంది.
Varun Tej - Lavanya Tripathi : రీసెంట్ డేస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది ట్రెండ్ గా మారింది. ఎక్కడ చూసినా చాలా మంది ధనవంతులు, సెలబ్రెటీలు ఈ తరహా పెళ్లిళ్లు చేసుకోవాలని కోరుకుంటున్నారు. విదేశాల్లో లేదంటే జైపూర్ లాంటి ప్రదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా చేరారు. ఇప్పుడు వరుణ్-లావణ్య త్రిపాఠి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకొనేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అందుకు వారు వెడ్డింగ్ ప్లానర్లను కూడా నియమించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు వచ్చినా.. ముందు ఎవరూ నమ్మలేదు. కానీ ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇటీవలే ఈ జంట కుటుంబసభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వరుణ్, లావణ్య పెళ్లిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అప్పుడే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి హడావుడి మొదలైంది. పెళ్లికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ కూడా వినిపిస్తోంది.
Read Also : Director NSR Prasad Death : టాలీవుడ్‌లో విషాదం - శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన దర్శకుడు మృతి
ఈ క్రమంలోనే వారు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారనే వార్త ఇటీవలి కాలంలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ వెడ్డింగ్ కోసం వారు ఇప్పటికే వెడ్డింగ్ ప్లానర్లను కూడా నియమించుకున్నట్టు తాజా సమాచారం. వారు దేశంలో ప్రసిద్ధ వ్యక్తుల కోసం పని చేసినట్టు తెలుస్తోంది. ఇటలీలోని కొన్ని రిసార్ట్‌ల చిత్రాలను కూడా వారికి అందించారని టాక్. అయితే పెళ్లి తేదీ సమీపిస్తున్న కొద్దీ వేదికపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే వరుణ్ తేజ్, లావణ్యల వివాహం ఆగస్టు 24వ తేదీ జరగబోతుందంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున అనే సినిమా ఆగస్టు 24వ తేదీ విడుదలకు సిద్ధమైంది. అయితే తన సినిమా విడుదలైనటువంటి మరుసటి రోజు వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నారంటూ ఈ వార్త సంచలనంగా మారింది.
చిరంజీవి సోదరుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు కుంటుంబంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే నెలలో పెళ్లి వైభవంగా జరగనున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య కలిసి 'మిస్టర్' సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చింది.
Read Also : దుల్కర్ సల్మాన్ 'కాంత'లో నటిస్తూ, నిర్మిస్తోన్న రానా దగ్గుబాటి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial