Director NSR Prasad Death : టాలీవుడ్‌లో విషాదం - శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన దర్శకుడు మృతి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ మృతి చెందారు.
![Director NSR Prasad Death : టాలీవుడ్‌లో విషాదం - శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన దర్శకుడు మృతి NSR Prasad Passed Away Srikanth Shatruvu Navdeep Natudu movies director is no more Director NSR Prasad Death : టాలీవుడ్‌లో విషాదం - శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన దర్శకుడు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/29/16814af86e69bd07a07966a9fed48f461690622621484313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు చిత్రసీమ ఓ దర్శకుడిని కోల్పోయింది. ఆర్యన్ రాజేష్ కథానాయకుడిగా మూవీ మొఘల్ డి. రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రానికి ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ (NSR Prasad Director) దర్శకత్వం వహించారు. ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు.
శ్రీకాంత్, నవదీప్‌తో సినిమాలు తీసిన ప్రసాద్
శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా నటించిన 'శత్రువు' (Shatruvu Srikanth Movie) చిత్రానికి కూడా ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించారు. నవదీప్ హీరోగా 'నటుడు' సినిమా (Navdeep Natudu Telugu Movie) కూడా తీశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వర్గాలకు 'సీతారామ్'గా ఆయన సుపరిచితులు.
Director NSR Prasad Passed Away : సీతారామ్ అలియాస్ ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. పలువురు ప్రముఖ దర్శకుల దగ్గర ఆయన రచయితగా దర్శకుడిగా పని చేశారు. ప్రసాద్ దర్శకత్వం వహించిన 'రెక్కీ' సినిమా ఇంకా విడుదల కాలేదు. త్వరలో ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ గురించి నిజం తెలుసుకున్న ఊర్వశి రౌతేల - కానీ?
ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ అకాల మరణంతో... ఆయన సన్నిహితులు, ఆయనతో పని చేసిన వ్యక్తులు విషాదంలో మునిగారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్ మరణం పట్ల తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంది.
ప్రముఖుల్ని కోల్పోయిన తెలుగు చిత్రసీమ
Telugu movie celebrities death in 2023 : ఈ ఏడాది (2023) ప్రారంభం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కోలుకోలేని విషాదాలు ఎదురవుతూ ఉన్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్, నటి జమున, యువ కథానాయకుడు నందమూరి తారక రత్న, ప్రముఖ గాయని వాణీ జయరామ్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇటీవల నటుడు శరత్ కుమార్ సైతం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 'పెళ్లి పందిరి' చిత్ర నిర్మాణ కాస్ట్యూమ్స్ కృష్ణ, సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వర రావు సైతం ఈ ఏడాది పై లోకాలకు వెళ్లిపోయారు. వరుస మరణాలు చిత్రసీమ ప్రముఖులను షాకుల మీద షాకులు ఇచ్చాయి.
Also Read : శ్యాంబాబు ఎవరు 'బ్రో' - ఏపీ మంత్రి డ్యాన్స్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్?
వీవీ వినాయక్, శ్రీను వైట్ల, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి దర్శకులకు గురువు అయిన సాగర్, సూర్య సహా ఎందరో తమిళ కథానాయకుల నటనకు తెలుగులో తన గొంతుతో ప్రాణం పోసిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, దిగ్గజ గాయని వాణి జయరామ్ కూడా ఈ ఏడాది తుదిశ్వాస విడిచారు. ఒక్కొక్కరి మరణం తెలుగు చిత్రసీమ ప్రముఖులను ఎంతో బాధించింది. సీనియర్లతో తమకు ఉన్న అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)