అన్వేషించండి

'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ - నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్, సాంగ్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'హాయ్ నాన్న' చిత్రం నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ ను అందించారు మేకర్స్. 'అమ్మాడి' అంటూ సాగే ఈ సాంగ్ ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది 'దసరా'(Dasara) మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని త్వరలోనే 'హాయ్ నాన్న'(Hi Nanna) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ అండ్ సాంగ్స్​కు నేషనల్ వైడ్​గా అనూహ్య స్పందన లభించింది. రీసెంట్​గా మ్యూజికల్ ప్రమోషన్స్​ని స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్స్​గా నిలిచాయి. ఫస్ట్ సింగిల్ 'సమయమా' పాటలో నాని, మృణాల్ ఠాకూర్ మధ్య లవ్, బాండింగ్ చాలా బాగా చూపించారు.

ఇక రెండో పాట 'గాజు బొమ్మ'లో తండ్రి, కూతురు పంచుకునే అందమైన అనుబంధాన్ని హృదయాన్ని హత్తుకునేలా చిత్రీకరించారు. దీంతో ఆ రెండు పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మేకర్స్ 'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్(3rd Single) అప్డేట్ ని అందించారు. 'అమ్మాడి'(Ammadi) అంటూ సాగే ఈ థర్డ్ సింగిల్ ని నవంబర్ 4న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాని, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్​లో ఉంది. పోస్టర్​ని బట్టి చూస్తుంటే 'అమ్మాడి' సాంగ్ ఓ రొమాంటిక్ నెంబర్ అని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

తండ్రీ, కూతుర్ల మధ్య ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో 'హాయ్ నాన్న' మూవీ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ చెబుతూ వచ్చారు. కానీ థర్డ్ సింగిల్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో హీరోయిన్ మృణాల్​తో నాని రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని స్పష్టం అవుతుంది. 'ఖుషి' మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ ఫామ్ లో ఉన్న హేషమ్ అబ్దుల్ వాహబ్ 'హాయ్ నాన్న' కోసం బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ అమ్మాడి కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తన ప్రతి సినిమాను దగ్గరుండి మరి ప్రమోట్ చేసే నాని 'హాయ్ నాన్న' కోసం ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశాడు.

సినిమా రిలీజ్​కి రెండు నెలల సమయం ఉండగానే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు నాని, మృణాల్ ఠాకూర్ కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. నాని నటిస్తున్న సెకండ్ పాన్ ఇండియా మూవీ ఇది. 'దసరా'తో పాన్ ఇండియా వైడ్ గా అలరించిన నాని.. హాయ్ నాన్నతో దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ప్రమోషన్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. శౌర్యువ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నాడు.

వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బేబీ కియారా కన్నా ఇందులో నాని కుమార్తెగా కనిపించనుంది  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. డిసెంబర్ 7న తెలుగు, హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : కార్తీ మంచి మనసు - సేవా కార్యక్రమాల కోసం కోటి 25 లక్షలు విరాళం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Cyclone Fengal: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
ఫెంగల్ తుపాను ఎఫెక్ట్ - తిరుమలలో విరిగిపడిన కొండచరియలు, వర్షాలతో విమానాలు రద్దు
Bougainvillea OTT: థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
థియేటర్లలోకి ‘పుష్ప 2’తో... ఓటీటీలోకి ‘బోగన్ విల్లా’తో... డిసెంబర్‌లో ఫహాద్ ఫాజిల్ డబుల్ ధమాకా
Jay Shah: ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
ఐసీసీ చైర్మన్‌గా జై షా పగ్గాలు, భారతీయుడి ముందు నిలిచిన ఎన్నో సవాళ్లు !
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ - పోలీసులకు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న బాలిక తండ్రి
Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
Embed widget