అన్వేషించండి

Aadikeshava Movie: డ్యాన్సులో శ్రీలీలతో పోటీపడ్డ వైష్ణవ్ తేజ్ - ‘హే బుజ్జి బంగారం’ సాంగ్‌ చూశారా?

Aadikeshava: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న 'ఆదికేశవ' చిత్రం నుండి సెకండ్ సింగిల్ విడుదలైంది. 'హే బుజ్జి బంగారం' అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

'ఉప్పెన' సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. 'ఉప్పెన' తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. దీంతో మరోసారి ఉప్పెన స్థాయి హిట్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ త్వరలోనే 'ఆదికేశవ' అనే చిత్రంతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రీసెంట్ గానే 'మ్యాడ్' మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సితార సంస్థ దీపావళికి 'ఆదికేశవ' తో మరో బ్లాక్ బస్టర్ ను అందుకునేందుకు సిద్ధమవుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తుండగా, జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు. ఫర్ ది ఫస్ట్ టైం వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ ఫిలింలో నటిస్తుండడం, శ్రీలీలతో మొదటిసారి జోడి కట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

తాజాగా విడుదలైన 'సిత్తరాల సిత్రావతి' అనే సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటలో వైష్ణవ్, శ్రీ లీల డాన్స్ తో అదరగొట్టేసారు. ఇక తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. 'హే బుజ్జి బంగారం' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉంది. హీరో తన ప్రేమను హీరోయిన్ పై తెలిపేలా ఈ పాట సాగనుండగా, ఈ మెలోడీ కోసం జీవి ప్రకాష్ కంపోజ్ చేసిన ట్యూన్ కొత్త అనుభూతినిచ్చింది. మరోసారి ఈ పాటలో వైష్ణవ్, శ్రీలీల తమ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేసారు. ఈ పాట మొత్తాన్ని ఫారిన్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఆలపించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

ప్రస్తుతం ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాతో మలయాళ అగ్ర నటుడు జోజు జార్జ్, అపర్ణ దాస్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. డూడ్లీ, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నులి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. దీపావళి కానుకగా నవంబర్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు హీరోయిన్ గా 'స్కంద' మూవీ తర్వాత శ్రీలీల నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. రీసెంట్ గా వచ్చిన 'స్కంద'లో శ్రీలీల పాత్రకి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. కాకపోతే సాంగ్స్ లో తన డాన్స్ తో అదరగొట్టింది.

ఇప్పటికే విడుదలైన పాటలను బట్టి చూస్తే 'ఆదికేశవ' సినిమాలో కూడా డాన్స్ అదరగొట్టిందని అర్థమవుతుంది. కానీ ఇందులో తన పాత్రకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుందో చూడాలి. అటు వైష్ణవ్ తేజ్ కూడా తన గత చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కమర్షియల్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద 'ఆది కేశవ' ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Also Read : పెళ్లి చేసుకున్న ప్రభాస్, అనుష్క - వాళ్లకు ఓ పాప కూడా, వైరల్ ఫోటోలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget