Hero Siddarth : ‘ఓయ్’ ఇప్పుడు చేస్తే చూస్తారా? అవార్డులు ఇవ్వకపోతే వెళ్లిపోతాడులే అనుకున్నారేమో: సిద్ధార్థ్
Hero Siddarth: వాలంటైన్స్ డే స్పెషల్ గా ఓయ్ సినిమా రీ రిలీజ్ అయ్యింది. సినిమా ప్రేమికులు ఈ సినిమాని 70 ఎంఎం పైన చూసి.. మరోసారి మెస్మరైజ్ అయ్యారు.
Hero Siddarth - OYE Re release: హీరో సిద్ధార్థ్.. చక్కటి ప్రేమ కథలతో యూత్ ని ఉర్రూతలూగించిన హీరో. 'బాయ్స్', 'ఓయ్', 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆయన. హీరో సిద్ధార్థ్ కి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక ఇప్పుడు ఆయన నటించిన ‘ఓయ్’ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమా లవర్స్ రీ రిలీజ్ లో సందడి చేశారు. కాగా.. ఆ సినిమా రీ రిలీజ్ గురించి, తనకు అవార్డులు రాకపోవడంపై సిద్ధార్థ్ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అప్పుడే చూడలేదు.. ఇప్పుడు చూస్తారా?
సిద్ధార్థ్ అంటే కొన్ని సినిమాలకు బ్రాండ్ అని, అలాంటి సినిమాలు ఇప్పుడు చేస్తారా? అంటూ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సిద్ధార్థ్ నవ్వుతూనే.. సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. "టైం పాస్ అయినప్పుడు చాలా విషయాలు హిస్టరీలో కన్ ఫ్యూజ్ అవుతాయి. 'ఓయ్' సినిమా 15 ఏళ్ల కిందటే చూడలేదు. ఇప్పుడు తీస్తే చూస్తామా? అంటారు. రీ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా రీ రిలీజ్ అయినప్పుడు నా లేడీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అలాంటి ఫ్యాన్స్ సిద్ధార్థ్ కు మాత్రమే ఉంటారు అని నేను చెప్పుకుంటాను. కాబట్టి రీ రిలీజ్ చేయొచ్చు" అని అన్నారు సిద్ధార్థ్.
అవార్డు గురించి ఆసక్తికర కామెంట్స్..
తన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయని కానీ, ఒక్క సినిమాకి కూడా నంది అవార్డు ఇవ్వలేదని సిద్ధార్థ్ అన్నారు. " 'బొమ్మరిల్లు'కి మంచి సక్సెస్ వచ్చింది. సినిమాకి నంది వచ్చిందా? ఇవ్వలేదు. కనీసం సర్టిఫికెట్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదు. చరిత్ర ఎప్పటికీ మారిపోదు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సక్సెస్ కదా?.. దానికి కూడా నందులు రాలేదు. ఒకటి ఏంటంటే.. ఇప్పటికీ నా సినిమాలు చూస్తుంటారు. చాలామంది వాళ్ల పిల్లలకి నా సినిమాలు చూపిస్తున్నారు. ఆ పిల్లలు వచ్చి మీ సినిమాలు బాగుంటాయి. మా అమ్మ, నాన్న మీ సినిమాలకి ఫ్యాన్స్ అంటుంటే అవే అవార్డుల్లా అనిపిస్తాయి. అదృష్టం కొద్ది నేను ఆ మాటలు వినేందుకు బతికే ఉన్నాను. ఆ మాటలు వింటే హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరికో అవార్డులు ఇచ్చారని బాధపడాలా? నాకు ఇవ్వలేదని అనుకోవాలా? వీడికి ఎందుకు, ఇవ్వకపోతే వెళ్లిపోతాడు లే అనుకుని ఇవ్వకపోతే.. వాళ్లు గెలిచినట్టా? లేక నేను ఓడినట్లా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. అందుకే, మనిషి ఎప్పుడూ నేను గెలిచాను, నేను ఓడిపోయాను అని అనుకోకూడదు. ప్రతిదానికి ఏదో ఒక రిజల్ట్ ఉంటుంది. ప్రతీ ఓటమి గెలుపుగా మారుతుంది. పది సంవత్సరాల తర్వాత ఓటమి గెలుపుగా మారొచ్చు చెప్పలేం. లైఫ్ ఈజ్ ఫ్యాసినేటింగ్" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సిద్దార్థ.
సిద్ధార్థ్ నటించిన 'ఓయ్' సినిమా వాలంటైన్స్ సందర్భంగా రీ రిలీజ్ చేశారు మేకర్స్. థియేటర్లలో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది ఆడియెన్స్ నుంచి. 2009లో రిలీజైన ఈ సినిమాకి అప్పట్లో అనుకున్నంత ఆదరణ లభించలేదు. కానీ, పాటలు మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు రీ రిలీజ్ కి మాత్రం అన్ని థియేటర్లు చాలాచోట్ల హౌస్ ఫుల్ గా కనిపించాయి. ముఖ్యంగా పాటలకు సీట్ల నుంచి లేచి మరీ డాన్సులు చేస్తున్న వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక గతంలో రిలీజైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా రీ రిలీజ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి.
Also Read: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో యశ్? క్లారిటీ ఇచ్చిన టీమ్