This Week Releases: ఈవారం థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలు - పాన్ ఇండియా మూవీకి పోటీగా చిన్న సినిమా
This Week Releases: ‘కల్కి 2898 ఏడీ’ ఇంకా థియేటర్లలో సందడి చేస్తుండగా ఇప్పుడు దానికి పోటీగా మరో ప్యాన్ ఇండియా మూవీ రంగంలోకి దిగనుంది. దాంతో పాటు ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఏంటో మీరూ చూసేయండి.
This Week Movie And Web Series Releases: ఈవారం థియేటర్లలో ఎక్కువగా సినిమా సందడి లేదు. థియేటర్లతో పోలిస్తే ఓటీటీలోనే ఎక్కువగా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. జులైలో అడుగుపెట్టిన తర్వాత సినిమాల సందడి కాస్త తగ్గింది. జూన్ చివరి వారంలో విడుదలయిన ‘కల్కి 2898 ఏడీ’.. ఇప్పటికీ థియేటర్లలో హవా కొనసాగిస్తోంది. ఇక జులై రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు ఒక పాన్ ఇండియా మూవీతో పాటు ఒక చిన్న బడ్జెట్ చిత్రం కూడా థియేటర్లలో విడుదల కానుంది. అంతే కాకుండా ఓటీటీలో కూడా ఒకట్రెండు తప్పా ఎక్కువగా హైప్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేవని మూవీ లవర్స్ అంటున్నారు.
పాన్ ఇండియా మూవీ..
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’.. ఫైనల్‌గా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. దాదాపు పాతికేళ్ల క్రితం విడుదలయ్యి క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. కోలీవుడ్ నుండి ఎంతోకాలం పాన్ ఇండియా మూవీ అనేది విడుదల కాకపోవడంతో ‘భారతీయుడు 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంటే చాలు.. దీని కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జులై 12న విడుదలకు సిద్ధమయ్యింది.
మధ్య తరగతి కుటుంబం కథ..
ఈవారం థియేటర్లలో ఎక్కువగా సినిమాలు విడుదల కావడం లేదు. పైగా ‘భారతీయుడు 2’ అనేది పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి పోటీగా దిగడం కూడా మంచిది కాదని చాలామంది మేకర్స్ ఫీల్ అయ్యి వెనక్కి తప్పుకున్నారు. కానీ తెలుగులో తెరకెక్కిన ఒక చిన్న బడ్జెట్ మూవీ మాత్రం ‘భారతీయుడు 2’తో పోటీపడడానికి సిద్ధమయ్యింది. అదే ‘సారంగదరియా’. రాజా రవీంద్ర లీడ్ రోల్ చేసిన ఈ మూవీని పద్మారావు అబ్బిశెట్టి డైరెక్ట్ చేశారు. ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరించారు. మధ్య తరగతి కుటుంబాలపై వస్తున్న కథలు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తున్నాయి. అలాంటి కథతో తెరకెక్కిన ‘సారంగదరియా’.. జులై 12న విడుదల కానుంది.
ఓటీటీ సినిమాలు
ఆహా
ధూమం (తెలుగు సినిమా) - జులై 11
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కమాండర్ కరణ్ సక్సేనా (హిందీ వెబ్ సిరీస్) - జులై 8
మాస్టర్ మైండ్ (హిందీ వెబ్ సిరీస్) - జులై 10
అగ్నిసాక్షి (తెలుగు వెబ్ సిరీస్) - జులై 12
ఫో టైమ్ (హిందీ వెబ్ సిరీస్) - జులై 12
నెట్‌ఫ్లిక్స్
రిసీవర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జులై 10
వైల్డ్ వైల్డ్ పంజాబ్ (హిందీ మూవీ) - జులై 10
వైకింగ్స్ - వాల్‌హల్లా సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - జులై 11
సోనీలివ్
36 డేస్ (హిందీ వెబ్ సిరీస్) - జులై 12
జియో సినిమా
పిల్ (హిందీ సినిమా) - జులై 12
మనోరమా మ్యాక్స్
మందాకిని (మలయాళం సినిమా) - జులై 12
Also Read: మహారాజా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - Netflixలో స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పట్నించి అంటే?