అన్వేషించండి

HBD Rana: హ్యాపీ బర్త్‌ డే రానా - ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోవడం భల్లాలదేవుడికే సాధ్యం

Happy Birthday Rana: హీరో అనే ట్యాగ్ వచ్చిన తర్వాత సపోర్టింగ్ రోల్ చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ రానా అలా కాదు.

Rana Birthday: సినీ పరిశ్రమలో కొందరు మల్టీ టాలెంటెడ్ నటీనటులు కూడా ఉంటారు. వారే నిర్మాతలుగా మారి ఒక మంచి కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కూడా అనుకుంటారు. అలా తెలుగు సినిమా స్థాయిని ఎప్పటికప్పుడు పెంచాలి అని కృషిచేసే నటీనటుల్లో రానా కూడా ఒకరు. ఇక ఈ బల్లాలదేవుడి పుట్టినరోజు సందర్భంగా తనలో ఉన్న కొన్ని అద్భుతమైన క్వాలిటీస్ గురించి, తన పర్సనల్, ప్రొఫెషన్ లైఫ్ గురించి అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. డిసెంబర్ 14న రానా.. తన 39వ ఏట అడుగుపెడుతున్నాడు. అందుకే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రానాకు అభిమానులు చెప్తున్న విషెస్సే కనిపిస్తున్నాయి.

హీరో ట్యాగ్ వద్దు..
హీరో అనే ట్యాగ్ కోసం రానా ఎప్పుడూ ప్రయత్నించలేదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు అని, హీరో పాత్రలు మాత్రమే చేయాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉంటాడు. అందుకే హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న తర్వాత ‘బాహుబలి’లో విలన్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తనకు ఎలాంటి కథలు ఎంచుకోవాలి అనే విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. రానా హీరోగా కనిపించిన చివరి చిత్రం ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను సాధించలేకపోయినా.. అలాంటి ఒక పాత్రను ఎంచుకున్నందుకు మాత్రం రానాను ప్రేక్షకులంతా ప్రశంసించారు. ఆ తర్వాత తను వెండితెర కనిపించలేదు కానీ రెండు సినిమాలకు మాత్రం ప్రెజెంటర్‌గా పనిచేశాడు. అంతే కాకుండా ‘రానా నాయుడు’తో ఓటీటీ వరల్డ్‌లో కూడా అడుగుపెట్టాడు.

ఒకే ఏడాదిలో రెండు సినిమాలకు ప్రజెంటర్‌గా..
సినిమాలో కంటెంట్ ఉంది అనిపిస్తే.. నిర్మాతగా, ప్రజెంటర్‌గా వ్యవహరించడానికి ఏ మాత్రం వెనకాడడు రానా. 2023లో ముందుగా తిరువీర్ హీరోగా నటించిన విలేజ్ కామెడీ డ్రామా ‘పరేషాన్’ను ప్రజెంట్ చేశాడు రానా. ఇక తాజాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కీడా కోలా’ను మరోసారి ప్రజెంటర్ అయ్యాడు. హీరోగా కెరీర్ ప్రారంభించక ముందు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా ఉన్నప్పుడే నంది అవార్డ్‌ను అందుకున్నాడు రానా. 2010లో ‘లీడర్’ అనే పొలిటికల్ డ్రామాతో హీరోగా మారాడు. మొదటి సినిమాలోనే ముఖ్యమంత్రి పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ మొదటి నుండే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండేవాడు రానా.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్..
నటుడిగా రానా కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది ‘బాహుబలి’. తను హీరోగా నిలదొక్కుకున్న తర్వాత కూడా విలన్‌గా చేయడానికి ఒప్పుకునే రిస్క్ తీసుకున్నాడు రానా. బల్లాలదేవుడి పాత్రలో ప్రభాస్‌ను ఢీకొట్టే కటౌట్‌గా నిలిచాడు. ‘విరాటపర్వం’, ‘రుద్రమదేవి’లాంటి లేడీ ఓరియెంటెడ్ కథల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా రానా ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ అనేది ట్రెండింగ్ అవుతుండడంతో ‘రానా నాయుడు’ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో తన బాబాయ్ వెంకటేశ్‌తో కలిసి నటించాడు. ఇందులో రానా, వెంకటేశ్‌ల కెమిస్ట్రీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ వెండితెరపై హీరోగా తన తరువాతి ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘వెట్టాయన్’లో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Also Read: సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'రానా నాయుడు' - ఏకైక ఇండియన్ సిరీస్‌గా ఆ ఘనత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget