Bandla Ganesh: హరీష్ శంకర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బండ్ల గణేష్, ఎందుకో తెలుసా?
దర్శకుడు హరీష్ శంకర్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. అదేంటో చూసేయండి మరి.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. దర్శకుడు హరీష్ శంకర్‌కు అరుదైన గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ పదేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆ చిత్రానికి నిర్మాతైన బండ్ల గణేష్ తన ఆనందాన్ని ఇలా పంచుకున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్‌కు సుమారు రూ.5 లక్షలు విలువ చేసే ‘ఒమెగా’ వాచ్‌ను కానుకగా అందించారు.
ఈ విషయాన్ని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ సర్‌ప్రైజ్ ఇచ్చిన మా బ్లాక్‌బాస్టర్ నిర్మాత బండ్ల గణేష్‌కు ధన్యవాదాలు. ‘గబ్బర్‌సింగ్’ చిత్రీకరణకు మీరు అద్భుతమైన సాయమందించారు. మీరు ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. నువ్వు లేకపోతే అంత ఫాస్ట్‌గా మూవీ అయ్యేది కాదు’’ అని హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఆయన చేతికి వాచ్ పెడుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
Also Read: ఓటీటీలో RRR వచ్చేది ఈ తేదీనే, అదనంగా నగదు చెల్లించాలా?
‘గబ్బర్ సింగ్’ సినిమా 2012 సంవత్సరంలో మే 11న విడుదలైంది. హిందీ హిట్ చిత్రం ‘దబాంగ్’కు ఇది రీమేక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించింది. అప్పటి వరకు హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఇది తిరుగులేని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇదే ఉత్సాహంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను రూపొందించారు. అయితే, అది ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. హరీష్ ప్రస్తతం పవన్ కళ్యాణ్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా తీస్తున్నాడు. బండ్ల గణేష్ ‘బ్లేడ్ బాజ్జీ’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!
View this post on Instagram
Successful Producer Bandla Ganesh gifted an expensive watch to Blockbuster Director Harish Shankar on the occasion of #DecadeForGabbarSingh #10YearsForGabbarSingh @harish2you @ganeshbandla pic.twitter.com/brxVrCRB6f
— Vamsi Kaka (@vamsikaka) May 11, 2022