HHVM Box Office Collection Day 2: పవన్ 'హరిహర వీరమల్లు' రెండో రోజు కలెక్షన్స్ - ఫస్ట్ డేతో పోలిస్తే...
HHVM Collections Day 2: తొలిరోజుతో పోలిస్తే పవన్ 'హరిహర వీరమల్లు' రెండో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గాయి. 2 రోజుల వసూళ్లు మొత్తం రూ.55.50 కోట్లు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan's HHVM Second Day Box Office Collections: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ హిస్టారికల్ అడ్వెంచర్ 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే కలెక్షన్స్ జోరు కొనసాగినా రెండో రోజు వసూళ్ల జోరు కాస్త తగ్గింది. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన మూవీల్లో ఒకటిగా నిలిచినా రెండో రోజు అంతగా ప్రభావం చూపలేకపోయినట్లు తెలుస్తోంది.
ఫస్ట్ డేతో పోలిస్తే...
రెండో రోజు దేశవ్యాప్తంగా రూ.8 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్నిల్క్ నివేదిక ద్వారా తెలుస్తోంది. రెండు రోజుల మొత్తం రూ.55.50 కోట్లకు చేరింది. ఫస్డ్ డే ప్రివ్యూలతో సహా రూ.47.50 కోట్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోస్ ద్వారా రూ.12.75 కోట్లు రాగా... శుక్రవారం మాత్రం అంతగా వసూళ్లు సాధించలేకపోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెలుగులో 24.42 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోల్లో 17.75 శాతం ఆక్యుపెన్సీ ఉండగా... రాత్రి షోల్లో మాత్రం కొంచెం మెరుగ్గా 32.53 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో...
ఈ మూవీ ఫస్ట్ డేనే తెలుగు రాష్ట్రాల్లో రూ.12.75 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే ఆంధ్రలో రూ.40.65 కోట్ల షేర్, నైజాంలో రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లో రూ.9 కోట్ల షేర్, రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో తొలి 2 రోజుల్లోనే రూ.49 కోట్ల షేర్, రూ.69 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు సాధించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?
చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సందడి అంబరాన్నంటింది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ ఫాన్ ఇండియా మూవీ కావడంతో థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్, పువ్వుల దండలతో సందడి చేశారు. పవర్ ఫుల్ యోధుడిగా పవన్ అదరగొట్టారని... భారీ యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ సీన్స్ అదిరిపోయాయంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫస్ట్ డేనే కామెంట్స్‌తో హల్చల్ చేశారు.
ఈ మూవీకి క్రిష్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా... పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. విలన్ రోల్‌లో
బాబీ డియోల్ నటించారు. వీరితో పాటే నోరా ఫతేహి, జిషు షేన్ గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్ఫణలో ఎ దయాకరరావు నిర్మించారు. మొగలుల కాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పెద్దల నుంచి వజ్రాలు, డబ్బు దోచుకుని పేదలకు పంచే యోధుడిగా పవన్ కనిపించారు. అసలు కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి వీరమల్లు ఎందుకు దొంగలించాలనుకున్నారు? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కింది.






















