Kingdom First Review: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?
Kingdom Review: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన 'కింగ్‌డమ్' ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సినిమా చూసిన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఏమన్నారో తెలుసుకోండి.

Vijay Deverakonda's Kingdom Movie First Review: రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కింగ్‌డమ్'. జూలై 31న థియేటర్లలో విడుదల. అయితే విడుదలకు వారం ముందు సినిమా చూసిన సెలబ్రిటీల జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. 'కింగ్‌డమ్' గురించి ఆయన ఏమన్నారో తెలుసా?
కింగ్‌డమ్... సూపర్ హిట్ అవుతుంది!
'కింగ్‌డమ్' విడుదల సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి సందీప్ రెడ్డి వంగా పాడ్ కాస్ట్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ... ''నేను కొన్ని విజువల్స్ చూశా. గౌతమ్ నాకు చూపించాడు. మస్త్ ఉన్నాయ్ విజువల్స్. మీ చేతుల్లో ఒక సూపర్ హిట్ ఉంది'' అని చెప్పారు.
ఆ వెంటనే 'హోప్ ఫుల్లీ' అని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అంటే... ''హోప్ ఫుల్లీ కాదు, తప్పకుండా సినిమా సూపర్ హిట్ అవుతుంది. సినిమా మంచిగా ఉంది. విజయ్ దేవరకొండ బావున్నాడు. యాక్షన్ బావుంది. పెర్ఫార్మన్స్ లు బావున్నాయి. మొత్తం సినిమా చూపించి ఉంటే బావుండు'' అని చెప్పారు సందీప్ రెడ్డి వంగా.
అప్పుడు విజయ్ దేవరకొండ ''యాక్చువల్లీ, మేం మొత్తం సినిమా చూపిద్దామని అనుకున్నాం. అనిరుధ్ సంగీతంతో సినిమా చూపించాలని గౌతమ్ తిన్ననూరి అనుకున్నాడు'' అని చెప్పారు. నేపథ్య సంగీతం లేకుండా సినిమా చూసినా బావుందని సందీప్ రెడ్డి వంగా వివరించారు.
విజయ్ దేవరకొండ సరసన 'కింగ్‌డమ్' సినిమాలో 'మిస్టర్ బచ్చన్' భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించారు. ఇందులో హీరోకి అన్నయ్యగా సత్యదేవ్ నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళంలోనూ సినిమా విడుదల కానుంది. అక్కడ విజయ్ దేవరకొండకు సూర్య డబ్బింగ్ చెప్పారు.





















