అన్వేషించండి

The Fantastic Four First Steps Review Telugu - 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' రివ్యూ: భూమిని కాపాడిన ఎంసీయూ సూపర్ హీరోస్ - సినిమా ఎలా ఉందంటే?

The Fantastic Four First Steps Review In Telugu: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) నుంచి వచ్చిన సూపర్ హీరోస్ సినిమా 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

MCU Latest Movie The Fantastic Four First Steps Review: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో సూపర్ హీరోస్ సినిమాలకు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంసీయూలో లేటెస్ట్ సినిమా 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'. ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఒకసారి చూడండి. 

కథ (The Fantastic Four First Steps Story): రీడ్ రిచర్డ్ (పెడ్రో పాస్కల్), స్యూ స్ట్రామ్ (వన్నెసా కిర్బీ), జానీ స్ట్రామ్ (జోసెఫ్ క్విన్), బెన్ (మోస్ బాక్రాక్)... ఆస్ట్రోనాట్స్. ఆ నలుగురూ ఒక టీమ్! వాళ్ళను 'ఫెంటాస్టిక్ ఫోర్' అంటుంటారంతా! భూమిని కాపాడటం కోసం ఎల్లవేళలా శ్రమించడం వాళ్ళ పని.  

స్యూ గర్భవతి కావడంతో రీడ్, స్యూ దంపతులకు పుట్టబోయే బిడ్డకు సూపర్ పవర్స్‌ ఉంటాయా? సాధారణ బిడ్డ భూమి మీదకు వస్తుందా? అని టీవీల్లో చర్చలు సైతం జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆకాశం నుంచి సిల్వర్ సర్ఫర్ (జూలియా గార్నర్) పిడుగు లాంటి వార్త చెబుతుంది. గలాక్టస్ (రాల్ఫ్ ఇన్నేసన్) అతి త్వరలో భూమిని మింగేస్తాడని, ఈలోపు ఎంజాయ్ చేయమని హెచ్చరిస్తుంది.

గలాక్టస్ అన్వేషణలో విశ్వంలోకి వెళుతుంది 'ది ఫెంటాస్టిక్ ఫోర్' టీమ్. స్యూకు జన్మించబోయే అబ్బాయిను తనకు ఇవ్వమని, ఆ త్యాగానికి స్యూ అంగీకరిస్తే... భూమండలం మీద ప్రపంచాన్ని (మనుషులను) విడిచిపెట్టడానికి తనకు అభ్యంతరం లేదని చెబుతాడు. అప్పుడు స్యూ ఏం చేసింది? భూమిని, భూమ్మీద ప్రజలను కాపాడటం కోసం తన బిడ్డను త్యాగం చేసిందా? లేదా? సిల్వర్ సర్ఫర్ భాషను జానీ స్ట్రామ్ ఎలా డీకోడ్ చేశాడు? ఆమె నేపథ్యంలో ఏమిటి? భూమ్మీదకు వచ్చిన గలాక్టస్‌ను ఫెంటాస్టిక్ ఫోర్ ఏం చేసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (The Fantastic Four Review Telugu): హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరోస్ సినిమాలు అంటే లార్జర్ దేన్ లైఫ్ ఫైట్లు ఉండటం సహజం. క్యారెక్టర్స్ నుంచి సన్నివేశాల వరకు ప్రతి అంశంలోనూ సహజత్వానికి దూరం కనిపిస్తుంది. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'లో కామన్ ఆడియన్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి. 

విజువల్స్ పరంగా సూపర్ హీరోస్ సినిమాల్లో కనిపించే విజువల్ గ్రాండియర్ 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'లో ఉంది. ఆ విజువల్స్‌ను డామినేట్ చేసే ఎమోషన్ ఉంది. మరీ సూటిగా చెప్పాలంటే... మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది. ఎట్టిపరిస్థితుల్లో అయినా సరే తన బిడ్డను కాపాడుకోవాలని తల్లి చేసిన పోరాటం ఉంది. బిడ్డపై తల్లి ప్రేమ, తల్లి చేసే పోరాటం మిగతా సూపర్ హీరోస్ సినిమాలలో 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'ను కాస్త భిన్నంగా నిలబెట్టింది. ఇంకా చెప్పాలంటే... సూపర్ హీరోలు ఆకాశం నుంచి ఊడిపడినట్టు చూపించకుండా, సామాన్యులకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయో వివరిస్తూ సినిమాను ప్రారంభించడం వల్ల తెరపై హీరోలూ మనలో ఒకరేనని ప్రేక్షకులు భావించేలా చేయడంలో దర్శకుడు మాట్ షాక్‌మ్యాన్ సక్సెస్ అయ్యారు.

ప్రపంచాన్ని (భూమి మీద మనుషులను) కాపాడటం స్యూ తన బిడ్డను త్యాగం చేయాలనే చర్చ జరుగుతుంది. అప్పుడు 'ప్రపంచం కోసం బిడ్డను త్యాగం చేయను. అలాగే, తన బిడ్డ కోసం ప్రపంచాన్ని త్యాగం చేయను' అని నలుగురిలో నిలబడి స్యూ బలంగా చెబుతుంది. అక్కడ తల్లి ప్రేమ కనబడుతుంది. 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' సినిమా రాతను ఆ ఒక్క సన్నివేశం మార్చింది. ఎందుకు అంటే... ఆ సీన్ వల్ల క్లైమాక్స్‌లో స్యూ చేసే పోరాటం భావోద్వేగభరితంగా మారింది. దాంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. నలుగుర్ని కాపాడటం కోసం ఒక్కర్ని త్యాగం చేయడం తప్పు కాదన్నట్టు కాకుండా కుటుంబం, స్నేహానికి విలువ ఇచ్చినట్టు చూపించడం 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'లో భారతీయుల్ని సైతం ఆకట్టుకునే అంశం. సిల్వర్ సర్ఫర్ ఫ్లాష్‌బ్యాక్‌ను సైతం ఎమోషనల్‌గా తీశారు. అయితే గలాక్టస్‌కు ఆవిడ ఎందుకు బానిసత్వం చేస్తుందనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఫెంటాస్టిక్ ఫోర్ ఎదిరించడానికి ట్రై చేసినప్పుడు ఆవిడ కూడా చేయవచ్చు కదా! గలాక్టస్‌ ఎందుకంత శక్తివంతంగా మారాడు? ఎలా మారాడు? అతని నేపథ్యం ఏమిటి? అనేది కూడా చూపించలేదు.

సూపర్ హీరోస్ నుంచి భారీ యాక్షన్ సీన్లు ఇందులో లేవు. ఆ యాక్షన్ కోరుకునే ప్రేక్షకులను అది డిజప్పాయింట్ చేసే అంశమే. కథ పరంగా సినిమాలో గొప్ప కాన్‌ఫ్లిక్ట్‌ లేదు. ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేదు. ఇందులోనూ సగటు భారతీయ కమర్షియల్ సినిమాలో చూసే కథ, కథనాలే  కనిపిస్తాయి. సూపర్ హీరోస్ ఉండటం వల్ల యాక్షన్ సీన్లు, విజువల్స్ తెరపై భారీగా కనిపిస్తాయి. ఆ విజువల్స్ మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తాయి. ఆర్ట్ వర్క్ పరంగా 1960 వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు.

Also Read: 'మహావతార్ నర్సింహ' రివ్యూ: యానిమేషన్‌లో భక్త ప్రహ్లాదుడి కథ - పూనకాలు తెప్పించిన ఉగ్ర నరసింహావతారం... సినిమా ఎలా ఉందంటే?

The Fantastic Four First Steps Review Telugu - 'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్' రివ్యూ: భూమిని కాపాడిన ఎంసీయూ సూపర్ హీరోస్ - సినిమా ఎలా ఉందంటే?

ఫెంటాస్టిక్ ఫోర్... నలుగురి నటన బావుంది. అయితే అందరిలో వన్నెసా కిర్బీ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్, ఎమోషన్... రెండింటిలోనూ ఆవిడ బాగా చేశారు. జానీ పాత్రలో జోసెఫ్ క్విన్, బెన్ పాత్రలో మోస్ బాక్రాక్ నవ్వించారు. రీడ్ పాత్రలో పెడ్రో పాస్కల్ నటన డీసెంట్‌గా ఉంది.

'ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్'... సూపర్ హీరోస్ సినిమాల్లో ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. సగటు సూపర్ హీరోస్ యాక్షన్ సినిమాల్లో కనిపించే ఓవర్ ద టాప్ యాక్షన్ సీన్స్ లేవు. కానీ, గ్రాండియర్ విజువల్స్ ఉన్నాయి. భారతీయ ప్రేక్షకులు కోరుకునే మదర్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. పిల్లలతో కలిసి హ్యాపీగా ఫ్యామిలీ అంతా చూసే చిత్రమిది. డోంట్ ఎక్స్‌పెక్ట్‌ మార్వెల్ ఫిల్మ్స్‌ కైండ్ ఆఫ్ స్టోరీ, యాక్షన్.

Also Read'హరిహర వీరమల్లు' రివ్యూ: ఫస్టాఫ్ సూపర్ హిట్ - సెకండాఫ్? పవన్ సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్!

View More
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date:  రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget