Fahad Fazil: పెద్ద సినిమా అన్నాడు... పేరు కూడా చెప్పలేదు... ఆ కామెంట్స్ పుష్ప గురించేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ పుష్ప. హీరోకి నేషనల్ అవార్డు తేవడంతో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ సినిమా పేరు కూడా చెప్పడానికి ఫహాద్ ఫాజిల్ ఇష్టపడడం లేదా?

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటనకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. 'పుష్ప' సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అంతకు ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆయన చూపిన విలనిజానికి చాలా మంది ఫాన్స్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమా గురించి కామెంట్ చేశారా? పుష్ప పేరు చెప్పడానికి కూడా ఫహాద్ ఫాజిల్ ఇష్టపడడం లేదా? సోషల్ మీడియాలో ఒక్కటే డిస్కషన్... ఎందుకో తెలుసా?
పెద్ద సినిమా అన్నాడు...
పేరు కూడా చెప్పలేదు! దాంతో?
ఫహాద్ ఫాజిల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన ఒక పెద్ద సినిమా తనను ఫెయిల్ చేసిందని కామెంట్ చేశారు. మూవీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో అందరూ 'పుష్ప' సినిమా గురించి మాట్లాడడానికి, ఆ సినిమా పేరు తీయడానికి ఫహాద్ ఇష్టపడడం లేదని కామెంట్ చేయడం మొదలు పెట్టారు.
'పుష్ప' ప్రచార కార్యక్రమాలలో ఫహాద్ ఫాజిల్ అసలు ఎక్కడ కనిపించలేదు. విలన్ రోల్ చేసిన యాక్టర్ లేకపోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. కేరళలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసినప్పుడు కూడా ఫహాద్ అటెండ్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ సినిమా మీద అతను కామెంట్ చేశాడని ఎవరికి వారు తమకు తోచినట్లు ఊహాగానాలను ప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. నిజానికి 'పుష్ప' సినిమా గురించి గత ఇంటర్వ్యూలలో ఫహాద్ ఫాజిల్ మాట్లాడారు. ఆ సినిమా వల్ల తాను పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం అయ్యానని చెప్పారు. ఆ సినిమా వల్ల తన ఇమేజ్ మారలేదని చెప్పారు. 'పుష్ప' గురించి గతంలో మాట్లాడారు కాబట్టి ఆ సినిమాను ఫహాద్ ఫాజిల్ కామెంట్ చేశారని అనుకోవడానికి లేదు.
Also Read: 'స్పిరిట్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా... షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
"I've failed with the big film in the last one year, so I don't want to talk about the film. When something is not in your control, so just leave it."
— Whynot Cinemas (@whynotcinemass_) July 25, 2025
– #FahadhFaasil | #Pushpa2 pic.twitter.com/gAuViQAzqp
రజనీకాంత్ సినిమా గుర్తుందా?
'జైలర్' సక్సెస్ తర్వాత రజనీకాంత్ మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ చేసిన సినిమా 'వేట్టయాన్'. ఆ సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్ యాక్ట్ చేశారు. అందులో ఆయనది ఇన్ ఫార్మర్ రోల్. సన్నివేశాలకు తగ్గట్టు కొన్ని చోట్ల వంటవాడిగా కూడా కనిపించారు. నిజానికి ఫహాద్ స్థాయికి తగ్గ క్యారెక్టర్ కాదు అది. రజనీకాంత్ సినిమా కావడంతో చేశారని, ఓకే చేసినందుకైనా ఇంపార్టెంట్ సీన్లు ఇవ్వలేదని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. బహుశా... ఫహాద్ ఫాజిల్ కామెంట్ చేసింది రజనీకాంత్ సినిమా గురించి అయ్యుండొచ్చు కదా!
Also Read: 'కింగ్‌డమ్'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?





















