Akshay Kumar Lifestyle: అక్షయ్ కుమార్ 58వ పుట్టినరోజు - తన విలాసవంతమైన జీవితం , ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Akshay Kumar Birthday: 58వ పుట్టినరోజు జరుపుకుంటున్న అక్షయ్ కుమార్ గురించి ఈ విషయాలు తెలుసా?

Akshay Kumar Rings in 58th birthday : బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వరుస ప్రాజెక్ట్స్ లో ఎప్పుడూ బిజిగానే ఉంటాడు. ఏడాదికి మినిమం నాలుగైదు సినిమాలతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ఎప్పుడూ తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ తో వార్తల్లోనే ఉంటాడు అక్షయ్.. అభిమానులతో టచ్ లోనే ఉంటాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్న అక్షయ్ మూవీస్ ఫ్లాప్ అయినా తన క్రేజ్ ఎంతమాత్రం తగ్గదు. సెప్టెంబర్ 9 అక్షయ్ కుమార్ పుట్టినరోజు.. ఈ ఏడాది 58వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు అక్షయ్.
పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి అక్షయ్ చాలా కష్టపడ్డాడు. ఒకప్పుడు సాధారణ జీవితం గడిపిన అక్షయ్ కుమార్ ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ నుంచి నికర విలువ వరకు ఈ విషయాలు తెలుసా...
58వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న అక్షయ్ కుమార్ ని చూస్తే ఇంత వయసు ఉంటుందా అనేలా ఫిట్ నెస్ మెంటైన్ చేస్తాడు. రోజూ ఉదయం 4 గంటలకే నిద్రలేచి వర్కౌట్స్ ప్రారంభిస్తాడు..ఆ తర్వాత రోజంతా ప్లాన్ ప్రకారం ఫాలో అయిపోయాడు. ప్రతి రోజూ రాత్రి త్వరగా నిద్రపోతాడు. సమయాన్ని పాటించడం, పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడమే తన ఆరోగ్యానికి, ఆనందానికి ప్రధాన కారణం అని చెబుతాడు.
పారితోషికం కాదు లాభాల్లో వాటా
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అక్షయ్ కుమార్ నికర ఆస్తుల విలువ 2500 కోట్లు. అత్యధికంగా పారితోషికం తీసుకునే నటుల్లో ఒకడు. ఈ మధ్య కాలంలో అక్షయ్ సినిమాల నుంచి పారితోషికం బదులు..లాభంలో వాటా తీసుకుంటున్నాడు. నివేదికల ప్రకారం, అక్షయ్ కుమార్ ఒక సినిమాకి 69 కోట్ల నుంచి 145 కోట్ల వరకు సంపాదిస్తాడు. ఈ అమౌంట్ తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ పై ఆధారపడి ఉంటుంది. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చాలా బ్రాండ్‌లను కూడా ఎండార్స్ చేస్తాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్ మెంట్ కోసం భారీగా రెమ్యనరేషన్ ఛార్జ్ చేస్తాడు.
ప్రధాన నగరాల్లో కోట్లలో ఆస్తులు
అక్షయ్ కుమార్ ఆస్తి కోట్లలో ఉంది. నివేదికల ప్రకారం జుహులో ఉన్న డూప్లెక్స్ ధర 80 కోట్లు. 2021లో, అక్షయ్ టొరంటోలో ఒక కొండను కొనుగోలు చేశాడు. దీనితో పాటు ప్రధాన నగరాల్లో ఆస్తులు కూడబెట్టాడు. ఈ సంవత్సరం అక్షయ్ తన ముంబైలోని 6 అపార్ట్‌మెంట్లను విక్రయించాడు. దీనివల్ల కోట్లలో లాభం వచ్చింది.
విలాసవంతమైన కార్లు
అక్షయ్ కుమార్ విలాసవంతమైన కార్లను ఇష్టపడతాడు. అక్షయ్ కుమార్ కార్ల గురించి చెప్పుకుంటే రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్-బెంజ్ GLS, రేంజ్ రోవర్ వోగ్ మరియు పోర్స్చే కాయెన్ ఉన్నాయి.
అక్షయ్ కుమార్ తన ఫిట్నెస్ సీక్రెట్
అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఇటీవల సాయంత్రం 7 గంటలకు డిన్నర్ చేస్తానని వెల్లడించాడు. ప్రతి సోమవారం ఉపవాసం ఉంటాడు. వ్యాయామం విషయంలో తగ్గేదేలే అన్నట్టుంటాడు..అందుకే ఆరు పదులకు చేరువవుతున్నా యంగ్ హీరోలతో పోటీపడుతూ ఫిట్నెస్ మెంటైన్ చేస్తున్నాడు.






















