అన్వేషించండి
Hanuman USA Collections: ఓవర్సీస్‌లో 'హనుమాన్' ప్రభంజనం - 5 మిలియన్ల డాలర్స్ తో అరుదైన ఘనత!
Hanuman : 'హనుమాన్' మూవీ ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని రేర్ ఫీట్ సాధించింది.
Hanu-Man crosses the $5 million milestone in the USA : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది.
ఇక రిపబ్లిక్‌డే సెలవు కావడంతో, ఆ రోజు సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఇక అదే జోరు వీకెండ్స్‌లో కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే హనుమాన్ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిపోయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమాకి ఓవర్సీస్ ఆడియన్స్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అక్కడ ఈ సినిమా మిలియన్ల కొద్ది డాలర్స్ ని కొల్లగొడుతుంది. ఓవర్సీస్ మార్కెట్ వద్ద స్టార్ హీరోల రికార్డ్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ లో మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 'హనుమాన్' ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఏకంగా 5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి అక్కడ హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ ఫీట్ తోహనుమాన్ ఓవర్సీస్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ గ్రాఫర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరోవైపు 'హనుమాన్' సినిమాకి ఇంత బిగ్ సక్సెస్ అందించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు స్పెషల్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. గ్రాటిట్యూడ్ మీట్ ద్వారా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు.
ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు ఈ సీక్వెల్‌లో తేజ సజ్జ హీరో కాదని, హనుమాన్ హీరో అని ఆ పాత్రలో ఓ టాలీవుడ్ బిగ్ స్టార్ నటిస్తారని చెప్పడంతో సకెండ్ పార్ట్‌లో హనుమాన్‌గా ఎవరు నటించబోతున్నారో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రశాంత్ వర్మ లిమిటెడ్ బడ్జెట్‌లో భారీ విజువల్ ఫీస్ట్‌ని ప్రేక్షకుల ముందు ఉంచడంతో ఇప్పుడు 'జై హనుమాన్' మీద ఇంతే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion