69th Filmfare Awards 2024: 'యానిమల్', 'జవాన్' చిత్రాలకు రెండేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డులు - ఉత్తమ సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్
69th Hyundai Filmfare Awards 2024: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2024 కార్యక్రమం గ్రాండ్ గా ప్రారంభమైంది. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన హిందీ చిత్రాలకు వివిధ విభాగాలలో అవార్డులను ప్రదానం చేసారు.
69th Hyundai Filmfare Awards 2024: హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ ఒకటి. ప్రతి ఏడాది ఘనంగా ఆ అవార్డుల వేడుక జరుగుతుంది. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 ఈవెంట్ శనివారం ప్రారంభమైంది. గుజరాత్ టూరిజంతో కలిసి రెండు రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ వేడుక, గాంధీ నగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2023లో ప్రేక్షకులను అలరించిన హిందీ సినిమాలకు అవార్డులు ప్రదానం చేసారు. మొదటి రోజు కరిష్మా తన్నా, అపర్శక్తి ఖురానా హోస్ట్ చేసిన కర్టెన్ రైజర్ హైలైట్ గా నిలవగా, ఈ ఈవెంట్ లో పలువురు బాలీవుడ్ స్టార్స్ సందడి చేసారు.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టెక్నికల్ విభాగంలో 'యానిమల్', 'జవాన్', 'సామ్ బహదూర్' సినిమాలు మెరిసాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ - డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషనల్ లో తెరకెక్కిన 'యానిమల్' చిత్రానికి రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యాటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ను అవార్డు వరించగా, బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో సింక్ సినిమా బ్లాక్ లేడీని అందుకుంది. విధు వినోద్ చోప్రా రూపొందించిన '12త్ ఫెయిల్' మూవీ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ - డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమా బెస్ట్ యాక్షన్ & బెస్ట్ VFX క్యాటగిరీలలో అవార్డులు సాధించింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన 'సామ్ బహదూర్' సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ & బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సహా మూడు అవార్డులు దక్కించుకుంది. ఇక 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాలోని 'వాట్ ఝుమ్కా' సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా బ్లాక్ లేడీని గెలుచుకున్నారు.
69వ హ్యుండాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ (టెక్నికల్) విజేతలు వీరే..
1. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
2. బెస్ట్ యాక్షన్ – స్పిరో రజాటోస్, ANL అరసు, క్రేగ్ మాక్రే, యానిక్ బెన్, కెచా ఖమ్ ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
3. బెస్ట్ సినిమాటోగ్రఫీ – అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అస్ )
4. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
5. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – సచిన్ లవ్‌లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
6. బెస్ట్ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ (సామ్ బహదూర్) & సింక్ సినిమా (యానిమల్)
7. బెస్ట్ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్ కోహ్లి, విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)
8. బెస్ట్ వీఎఫ్ఎక్స్ – రెడ్ చిల్లీస్ VFX (జవాన్)
9. బెస్ట్ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య ('వాట్ ఝుమ్కా' సాంగ్ - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
Also Read: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
ఇకపోతే ఈరోజు (జనవరి 28) గిఫ్ట్ లో 2వ రోజు 69వ హ్యుండాయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఇందులో బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ వంటి పలు విభాగాల్లో అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఈ వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ వంటి సినీ ప్రముఖులు హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేయనున్నారు. సింగర్ పార్థివ్ గోహిల్ పవర్ ప్యాక్డ్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ఘనంగా ముగియనుంది.
Also Read: 'పుష్ప 2' To 'సలార్ 2'.. బాక్సాఫీస్ ని ఢీకొట్టబోయే క్రేజీ సీక్వెల్స్!