Guntur Kaaram : సంక్రాంతికి 'గుంటూరు కారం' వస్తుందా? షూటింగ్ ఎంత వరకు వచ్చింది?
సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో 'గుంటూరు కారం' ఒకటి. మరి, ఆ సినిమా షూటింగ్ అప్డేట్ ఏమిటి? ఎంత వరకు వచ్చింది?
Guntur Kaaram Movie Shooting Update : సంక్రాంతి బరిలోకి రానున్న సినిమాల్లో ముఖ్యమైనది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న 'గుంటూరు కారం' ఒకటి. పరిశ్రమ ప్రముఖుల్లో, ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే... సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండటంతో సంక్రాంతికి సినిమా వస్తుందా? లేదా? అని సందేహాలు నెలకొన్నాయి. అటువంటి డౌట్స్ అవసరం లేదని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
'గుంటూరు కారం' షూటింగ్ అప్డేట్ ఏంటి?
Guntur Kaaram Talkie Part Shooting : 'గుంటూరు కారం' టాకీ పార్ట్ షూటింగ్ ఒక వారం మినహా పూర్తి అయ్యింది. నాలుగు సాంగ్స్ కూడా షూటింగ్ చేయాలి. సో... ఈ చిత్రీకరణ అంతా డిసెంబర్ 20కి పూర్తి అవుతుందని సమాచారం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారట.
డిసెంబర్ రెండో వారంలో రెండో పాట!
'గుంటూరు కారం' సినిమాలో తొలి పాట 'దమ్ మసాలా'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అందులో మహేష్ క్యారెక్టరైజేషన్, హీరోయిజం ఎలివేట్ అయ్యేలా చూశారు. రెండో పాట మెలోడీ అని, అది డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
Also Read : 50 రూపాయలకు 'మంగళవారం' సినిమా - ఏపీ, తెలంగాణలో టికెట్ రేట్లు చూశారా?
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'గుంటూరు కారం' రూపొందుతోంది. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే... మహేష్ బాబును మాంచి మాసీగా చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఇప్పటి వరకు విడుదల చేసిన మెజారిటీ స్టిల్స్ అన్నిటిలో బీడీ కలుస్తూ కనిపించారు మహేష్. సినిమాలో ఇంకెన్ని కాలుస్తారో చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విడుదల వాయిదా వేసే అవకాశం లేదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెబుతున్నారు.
Also Read : నేను అడిగితే బన్నీ చరణ్ సినిమాలు చేస్తారు - స్వాతి రెడ్డి గునుపాటి
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి.
Feel the heat with the sizzling & Spicy beats of #GunturKaaram's First Single ~ #DumMasala lyrical video out now.
— Aditya Music (@adityamusic) November 7, 2023
🎶 https://t.co/P3Hsl0jBno
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegde & #JyotiNooran
SUPER 🌟 @urstrulyMahesh #Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/kTMULk6CzA