అన్వేషించండి

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా - 'సాహసం' నిర్మాతతో మరోసారి!

Gopichand New Film: మ్యాచో స్టార్ గోపీచంద్ కొత్త సినిమాకు సంతకం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం 'విశ్వం' చేస్తున్న ఆయన... ఆ తర్వాత రెండు సినిమాలు రెడీ చేస్తున్నారు.

Gopichand to work with Sahasam producer BVSN Prasad again: మ్యాచో స్టార్ గోపీచంద్ స్పీడ్ పెంచారు. ఆయన తాజాగా ఓ కొత్త సినిమాకు సంతకం చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

'సాహసం' నిర్మాతతో మరో సినిమా
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ 'సాహసం'. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఆ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN Prasad) ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆయన నిర్మాణంలో గోపీచంద్ మరో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలిసింది.

'సాహసం' (2013) సినిమా విడుదల అయ్యి పదేళ్లు దాటింది. ఇప్పటికి గోపీచంద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబినేషన్ మళ్లీ కుదిరింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందే ఈ సినిమాను ఈ నెలలో అనౌన్స్ చేయనున్నారు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజిలో ఉన్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం. సినిమా ప్రారంభోత్సవం రోజున దర్శకుడితో పాటు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.

ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న గోపీచంద్!?
కమర్షియల్ సినిమాలకు కామెడీ హంగులు మేళవించి సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇప్పుడు గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నారు. అదే 'విశ్వం'. జూలైలో ఆ సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ చెయ్యాలని మ్యాచో స్టార్ రెడీ అవుతున్నారట.

Also Readచిరంజీవి మద్దతు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికే - ఓపెన్‌గా చెప్పిన మెగాస్టార్!


Gopichand upcoming movies 2024: 'జిల్' సినిమాలో తనను అప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా న్యూ మేకోవర్, స్టైలిష్ అవతారంలో చూపించిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా ఓకే చేశారు. 'జిల్' ప్రొడ్యూస్ చేసిన, తన సన్నిహిత మిత్రులకు చెందిన యువి క్రియేషన్స్ సంస్థ ఆ మూవీ ప్రొడ్యూస్ చేయనుంది. దాంతో పాటు బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న సినిమా షూటింగ్ జూలై నుంచి స్టార్ట్ చేయాలని గోపీచంద్ భావిస్తున్నారట.

Also Read: తమిళంలో 'యానిమల్'కు రోలెక్స్ సూర్య అయితే బెస్ట్ - 'యానిమల్ పార్క్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా


'భీమా'తో 2024లో థియేటర్లలోకి వచ్చిన గోపీచంద్!
ఈ ఏడాది 'భీమా' సినిమాతో గోపీచంద్ థియేటర్లలోకి వచ్చారు. కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఆ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ల నుంచి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కానీ, నటుడిగా గోపీచంద్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఓకే చేసిన మూడు సినిమాలు భారీ విజయాలు అందించాలని ఆశిద్దాం.

Also Readఎన్టీఆర్ 'టెంపర్', వరుణ్ 'తొలిప్రేమ' నటి అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి - తాళి కట్టిన వెంటనే భర్తకు ముద్దు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget