Globetrotter Song: సడన్‌గా SSMB29 సాంగ్ రిలీజ్ చేసిన రాజమౌళి... మహేష్ కోసం శృతి!
SSMB29 First Single: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 - Globetrotter సినిమాలో మొదటి పాట 'సంచారి'ని విడుదల చేశారు.

ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) టీమ్ సోమవారం రాత్రి సడన్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో మొదటి పాటను విడుదల చేసింది. కొన్ని క్షణాల్లో ఆ పాట వైరల్ అయ్యింది. ఇంతకీ, ఆ సాంగ్ పాడినది ఎవరో తెలుసా?
మహేష్ బాబు కోసం శృతి హాసన్!
Shruti Haasan Sings First Song from SSMB29 - Globetrotter: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రూపొందిస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి గ్లోబ్ ట్రాటర్ (ప్రపంచ యాత్రికుడు) అని టీమ్ పేర్కొంటోంది. అయితే ఈ సినిమాకు 'వారణాసి' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఇప్పుడు అసలు విషయం అది కాదు... ఇందులో తొలి పాట విడుదలైంది. దాన్ని అనూహ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
మహేష్ - రాజమౌళి సినిమాలో మొదటి పాటను పాడినది ఎవరో తెలుసా? లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్. 'సంచారి... సంచారి...' అంటూ సాగే ఆ గీతాన్ని ఎంఎం కీరవాణి తనయుడు, యువ సంగీత దర్శకుడు కాలభైరవతో కలిసి ఆమె పాడారు. విడుదలైన కొన్ని క్షణాల్లో ఈ సాంగ్ వైరల్ అయ్యింది. ట్రెండింగ్ లిస్టులో చేరింది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. ఇందులో హీరో వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు చైతన్య ప్రసాద్.
Also Read: అప్పుడు మహేష్... ఇప్పుడు జయకృష్ణ... ఘట్టమనేని వారసుడి సినిమా అనౌన్స్ చేశారోచ్
కీ బోర్డులో కమల్ పాట ప్లే చేసిన కీరవాణి
'సంచారి సంచారి...' సాంగ్ రికార్డింగ్ టైంలో తీసుకున్న ఫోటోలు - వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు శృతి హాసన్. ''ఏదైనా పని ప్రారంభించే ముందు విగ్నేశ్వర మంత్రంతో మొదలు పెట్టడం అలవాటని కీరవాణి గారు చెప్పారు. ఆ మంత్రం ప్లే చేస్తారని అనుకున్నాను. సడన్‌గా అప్పా (కమల్ హాసన్) సాంగ్ ప్లే చేశారు'' అని శృతి పేర్కొన్నారు. 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ - శృతి జంటగా నటించారు. అందులో ఈ జంట నటనకు మంచి పేరు వచ్చింది. అంతకు ముందు 'ఆగడు' సినిమాలో ప్రత్యేక గీతం చేశారు శృతి హాసన్. ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ 'సంచారి సంచారి...' సాంగ్ కూడా హిట్టే.
Also Read: అనుపమకు 20 ఏళ్ళ అమ్మాయి వేధింపులు... వెలుగులోకి సంచలన నిజాలు
View this post on Instagram
నవంబర్ 15న టైటిల్ అనౌన్స్... ఇంకా ఇంకా?
నవంబర్ 15వ తేదీన... అంటే రాబోయే శనివారం నాడు మహేష్ - రాజమౌళి సినిమా ఈవెంట్ భారీ ఎత్తున చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్ మీద టైటిల్ రివీల్ చేయనున్నారు. ఆ ఈవెంట్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి 'సంచారి' టైటిల్ ఖరారు చేశారని ప్రచారం మొదలైంది. అయితే అందులో నిజం లేదని టాక్. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్ మాధవన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.





















