Ghaati: అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్!
Ghaati: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ముంబై వేదికగా జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో ఈ మూవీ టైటిల్ అండ్ ప్రీ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
![Ghaati: అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్! Ghaati is the title of Anushka Shetty’s milestone 50th film with director Krish Jagarlamudi Ghaati: అనుష్క శెట్టి 50వ చిత్రానికి టైటిల్ ఫిక్స్ - ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్ పోస్టర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/20/0e61a51c256341ba99f2b8d724531c511710901839145686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ghaati: సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అందం అభినయం కలబోసిన అతి కొద్దిమంది నటీమణులలో స్వీటీ ఒకరు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అయితే ఈమధ్య కాలంలో సినిమాలు తగ్గించేసిన అనుష్క.. ఇప్పుడు తన కెరీర్ లో మైలురాయి 50వ చిత్రానికి చేరువైంది. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.
అనుష్క చివరగా నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గతేడాది రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి రెడీ అయిందీ బొమ్మాళి. ప్రస్తుతం మలయాళంలో 'కథనార్ - ది వైల్డ్ సోర్సెరర్' అనే పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఇది ఆమె కెరీర్ లో 49వ చిత్రం కానుంది. ఇదే క్రమంలో తన గోల్డెన్ జూబ్లీ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళింది.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదొక ఉమెన్ సెంట్రిక్ సినిమా. ఇప్పటి వరకూ #Anushka50 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అయితే సడన్ గా ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అంతేకాదు నిన్న మంగళవారం ముంబై వేదికగా నిర్వహించిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఈవెంట్ లో ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Also Read: రామ్ చరణ్ 'RC 16' పూజకు వేళాయే - చీఫ్ గెస్ట్ ఎవరంటే?
అనుష్క చిత్రానికి 'ఘాటి' అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేసారు. ప్రీ లుక్ పోస్టర్ లో ఆమె ఫేస్ ను చూపించలేదు. చీరకొంగుతో ముసుగు కప్పుకొని నడిచి వెళ్తున్న బ్యాక్ సైడ్ లుక్ ను మాత్రమే ఆవిష్కరించారు. ఇది నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథ అని తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా గంజాయి వ్యాపారంలో చిక్కుకున్న ఓ మహిళ.. పగ, ప్రతీకారం, విముక్తి యొక్క గ్రిప్పింగ్ స్టోరీని వివరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో అనూష్క పాత్ర చాలా రఫ్ గా వుంటుందని, ఒక రకంగా 'క్వీన్ ఆఫ్ సౌత్' అనే తరహాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అంటున్నారు.
#GHAATI is a gripping tale of revenge, redemption and retribution where a victim turned criminal rises to the status of legend.
— First Frame Entertainments (@FirstFrame_Ent) March 19, 2024
Available post-theatrical release on @PrimeVideoIN@MsAnushkaShetty @DirKrish #SaiMadhavBurra #ChintakindiSrinivasRao @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/izeUw3VRdR
'వేదం' తర్వాత అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఘాటి'. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వంశీ కృష్ణ రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి చింతకింది శ్రీనివాస్ రావు రచయితగా పని చేస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read: సుహాస్ సరసన కీర్తి సురేష్ - సినిమా టైటిల్ ఏంటంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)