బాలీవుడ్లో గుర్తింపులేనివారే సౌత్ సినిమాలు చేస్తారనేవారు, ఆ హీరోలతో టచ్‌లో లేను: జెనీలియా
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌత్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ స్టేటస్ ని అందుకున్న హీరోయిన్స్ లో జెనీలియా కూడా ఒకరు. అప్పట్లో తన అందం, నటనతో జెనీలియా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. అయితే టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు జెనీలియాకి ఇతర ఇండస్ట్రీలో రాలేదు. ఈమె తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినా ఆ సినిమాలతోనే భారీ స్టార్ డం ను అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పెళ్లయిన ఆరు సంవత్సరాల తర్వాత గత ఎడాది మళ్లీ సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇచ్చింది.
రీ ఎంట్రీ లోనే తన భర్త రితేష్ దేశముఖ్ తో కలిసి 'మిస్టర్ మమ్మీ', 'వేద్' వంటి సినిమాల్లో నటించింది. వీటిలో 'వేద్' సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. అయితే తాజాగా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఎలా మారిందో చెబుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా బయట ఇండస్ట్రీ హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోలేని వారు సౌత్ సినిమాల్లో నటిస్తారని ఒకప్పుడు తనకు చెప్పేవారు’’ అని తెలిపింది. ఈ క్రమంలో జెనీలియా తనను తాను పరిశ్రమలో బయటి వ్యక్తిగా పేర్కొంది. సౌత్ స్టార్స్ అల్లుఅర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ వంటి సహనటులతో మీరు టచ్ లో ఉన్నారా? అని జెనీలియాని అడిగితే.. 'ప్రస్తుతం తాను వాళ్లతో టచ్ లో లేనని' వెల్లడించింది.
అంతేకాకుండా సౌత్ వర్సెస్, నార్త్ సినిమా గురించి మాట్లాడుతూ.. "భారతదేశం ప్రాంతీయ సినిమా కాదు. సౌత్, నార్త్, పంజాబీ, మరాఠీ అన్ని భాషల సినిమాలను చూడడం ఎంతో బాగుంది. ఇది ఇండియన్ సినిమాకి ఒక బ్లాంకెట్ లాంటిది. అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ స్టార్స్. సౌత్ లో వారికి భారీ స్థాయిలో అభిమానుల సంఖ్య ఉంది. అది వాళ్లకు సినిమా వారసత్వం నుండి వచ్చింది. అదే నా విషయానికొస్తే నేను సౌత్, నార్త్ రెండు సినిమాల్లోనూ బయట వ్యక్తినే. కానీ నేను సౌత్ లో సినిమాలు చేసినప్పుడు ఆ సమయంలో బాలీవుడ్లో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోలేని వాళ్ళు సౌత్ ఇండస్ట్రీకే వెళ్తారంటూ చెప్పేవారు" అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది జెనీలియా. దీంతో జెనీలియా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం జెనీలియా ప్రధాన పాత్రలో 'ట్రయల్ పీరియడ్' పేరుతో పొందిన ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ తోనే జెనీలియా ఓటీటీకి ఎంట్రీ ఇస్తోంది. జూలై 21 నుంచి ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read : బిగ్ బ్రేకింగ్ - 'ప్రాజెక్ట్ కె' గ్లింప్స్ వచ్చేసింది, టైటిల్ కూడా చెప్పేశారు!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial