అన్వేషించండి

Gangs Of Godavari : విశ్వక్ సేన్ సినిమాకి తప్పని రిలీజ్ డేట్ కష్టాలు - 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మళ్లీ వాయిదా?

Gangs Of Godavari : విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నట్లు తాజా సమాచారం.

Gangs Of Godavari To Get Postponed Again : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా సినిమాకి తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా 'దమ్కి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కేవలం 10 సినిమాల కెరియర్ లోనే తన గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ మరోసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడంతోపాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈసారి మరో మాస్ మూవీతో విశ్వక్ సేన్ హిట్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాకి సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడనున్నట్లు తాజా సమాచారం.

విశ్వక్ సేన్ సినిమాకి రిలీజ్ డేట్ కష్టాలు..

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాను మొదట డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. పైగా, 'సలార్' డిసెంబర్ 22కి రావడంతో ఆ వారంలో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్న నాని 'హాయ్ నాన్న', నితిన్ 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' సినిమాలు ముందుకు వచ్చాయి. దాంతో విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నా రవితేజ 'ఈగల్' తో పాటూ సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' వంటి సినిమాలు ఉండడంతో ఎట్టకేలకు మార్చి 8న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు.

కానీ ఈ డేట్‌కు కూడా సినిమా రిలీజ్ కావడం కష్టమని అంటున్నారు. అందుకు కారణం అదే రిలీజ్ డేట్ కి మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండడమే. ఫిబ్రవరిలో రిలీజ్ కావలసిన వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' రిలీజ్ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 8 కి వాయిదా పడింది. అలాగే తాజాగా గోపీచంద్ 'భీమా' తో పాటూ ఆనంద్ దేవరకొండ 'గంగం గణేశా' వంటి సినిమాలు మార్చి 8 నే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. దాంతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్ మరో రిలీజ్ డేట్ ను వెతికే పనిలో పడ్డట్లు ఇండ్రస్ట్రీ వర్గాల సమాచారం.

మార్చి మూడో వారానికి షిఫ్ట్ అయిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్..

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' రిలీజ్ మార్చి 8 నుంచి మార్చి మూడో వారంకి జరిగినట్లు తాజా సమాచారం. మార్చి 15 లేదా 22 ఏదో ఒక డేట్ ని ఫిక్స్ చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు డేట్స్ మిస్ అయితే ఆ తర్వాత 'టిల్లు స్క్వేర్' మార్చి 29 న రాబోతోంది. తర్వాత విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఏప్రిల్ 5 రిలీజ్ కి రెడీ అవుతోంది. కాబట్టి ఈ సినిమాలకు పోటీ లేకుండా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మేకర్స్ మార్చి మూడో వారంలోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read : ‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగు పెట్టిన మెగాస్టార్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget