By: ABP Desam | Updated at : 23 Mar 2023 04:26 PM (IST)
'గేమ్ ఆన్' సినిమాలో నేహా సోలంకి
అనగనగా ఓ యువకుడు. జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా... నిరాశతో లూజర్ కింద మిగిలిపోతున్న సమయంలో విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుంటాడు. అతని జీవితం ఓ ఆట మొదలవుతుంది. అది అతడిని ఏ తీరాలకు చేర్చింది? మధ్యలో ఏమైంది? అనే కథతో రూపొందిన సినిమా 'గేమ్ ఆన్' (Game On Movie). ఇందులో గీతానంద్ హీరో. నేహా సోలంకి (Neha Solanki) హీరోయిన్. వీళ్ళిద్దరిపై ఓ ప్రేమ పాట తెరకెక్కించారు.
ప్రేమలో పడిపోతున్నా
'పడిపోతున్నా... నిన్ను చూస్తూనే! పడిపోతున్నా... ప్రేమలోనే!'' అంటూ సాగే గీతాన్ని శుక్రవారం ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, హారికా నారాయణ్ ఆలపించారు. అశ్విన్, అర్జున్ సంగీతం అందించారు. సినిమాలో రెండో పాట ఇది.
'గేమ్ ఆన్'లో మొదట పాట 'రిచో రిచ్'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఆల్మోస్ట్ 3.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ పాటకు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చిత్ర బృందం తెలిపింది.
Also Read : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
గేమ్ ఆన్... ఇదొక ఎమోషనల్ జర్నీ!
'గేమ్ ఆన్' చిత్రాన్ని (Game On Movie) కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీగా సినిమాను రూపొందించామని దర్శక నిర్మాతలు తెలిపారు.
చిత్ర నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ''సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆల్రెడీ విడుదలైన టీజర్, ప్రచార చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. దాంతో సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం ఏర్పడింది. కొత్తదనంతో కూడిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. మా గీతానంద్, దర్శకుడు దయానంద్ అన్నదమ్ములే. వాళ్ళు చెప్పిన చెప్పిన కంటెంట్ నచ్చడంతో సినిమా నిర్మించా. టీమ్ అందరూ చక్కగా పని చేశారు. అరవింద్ విశ్వనాథన్ అద్భుతమైన విజువల్స్ అందించారు'' అని చెప్పారు.
Also Read : బ్రహ్మికి చిరు, చరణ్ సత్కారం - స్టార్స్‌ను మెప్పిస్తున్న 'రంగమార్తాండ'
చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ''రొటీన్ సినిమాలకు భిన్నమైన కథతో తీసిన చిత్రమిది. ఇప్పుడు తెలుగులో డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఆ జాబితాలో మా 'గేమ్ ఆన్' కూడా చేరుతుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో చాలా ట్విస్టులు, టర్నులు ఉన్నాయి. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్... అన్ని అంశాలు ఉన్నాయి. మా కథ నచ్చి సినిమా చేయడానికి వచ్చిన నిర్మాతకు థాంక్స్'' అని అన్నారు.
ఆదిత్య మీనన్, మధుబాల, 'బిగ్ బాస్' వాసంతి కృష్ణన్, కిరిటీ, 'శుభలేక' సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థలు : కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్, ఎడిటర్ : వంశీ అట్లూరి, స్టంట్స్: రామకృష్ణన్, నభా స్టంట్స్, సంగీతం : నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్, నేపథ్య సంగీతం : అభిషేక్ ఎ.ఆర్ మాటలు : విజయ్ కుమార్ సిహెచ్, ఛాయాగ్రహణం : అరవింద్ విశ్వనాథన్, నిర్మాత : రవి కస్తూరి, దర్శకత్వం : దయానంద్.
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Chiranjeevi Cancer : నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను - మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఒడిశా రైలు ప్రమాదంపై టాలీవుడ్ సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - రక్తదానం చేయాలని అభిమానులకు చిరు పిలుపు
Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Whatsapp: వాట్సాప్ ఛాటింగ్ ఇంతకు ముందులా ఉండదు - ఎందులో మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?