Extra- Ordinary Man Trailer : ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్రైలర్ - మైసమ్మ స్క్రీన్ ప్లే అదుర్స్, చివరిలో ట్విస్ట్!
Extra Ordinary Man : నితిన్, శ్రీలలా జంటగా నటించిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Extra- Ordinary Man Trailer : వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్''(Extra-Ordinary Man). ఆదిత్య మూవీస్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్జ్ టీజర్, సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోగా.. కాసేపటిక్రితమే ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ అంతా ఎంటర్టైన్మెంట్ వే లోనే సాగింది. అంతేకాదు ట్రైలర్ చూస్తే భీష్మ వైబ్స్ కూడా కనిపిస్తున్నాయి.
ఓ ఆర్డినరీ మ్యాన్ చేసిన ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంటే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం జీవితంలో హీరోగా ఎదగాలనుకునే ఓ కుర్రాడు, చిన్నతనం నుంచి తనలా కాకుండా ప్రతిరోజు డిఫరెంట్ లైఫ్ ని లీడ్ చేయాలని అనుకుంటాడు. అలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా మారుతాడు. అది నచ్చని నాన్న ఎంత తిట్టినా పట్టించుకోకుండా సినిమాల్లో చివరన ఉండే క్యారెక్టర్స్ లో నటిస్తూ ఉంటాడు. అది కూడా బోర్ కొట్టడంతో జీవితం అంటే ఇంతేనా, తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వమని మైసమ్మను అడగడంతో హీరో లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. జూనియర్ ఆర్టిస్ట్ గా ఉండే హీరో తనకు సంబంధం లేని గొడవలో ఇరుక్కుంటాడు.
ఆ గొడవను కూడా డిఫరెంట్ గా ఫీలై విలన్ తో ఫైటింగ్ కి దిగుతాడు. అసలు హీరో ఆ గొడవలో ఇరుక్కోడానికి కారణం ఏంటి? ఎందుకు ఫైటింగ్ కి దిగుతాడు? చివరికి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ హీరో అయ్యాడా? లేక ఆర్డినరీ మ్యాన్ గానే ఉండిపోయాడా? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీని చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. కొన్ని సోషల్ మీడియా పాపులర్ డైలాగ్స్ ని కూడా ఇందులో వాడేసారు. ఇక ట్రైలర్ చివర్లో రాజశేఖర్ ఎంట్రీ అయితే మెయిన్ హైలెట్ అని చెప్పాలి.
జీవితంలో ఎవరు ఏం చెప్పినా వినను అని రాజశేఖర్ అంటే, దానికి నితిన్ జీవితానా సార్? అనగానే జీవితం.. అంటే నాకు రెండు ఒకటేలే.. అని రాజశేఖర్ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయించింది. వక్కంతం వంశీ కూడా ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ ని ఎంచుకోవడం ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ చూస్తే ఈసారి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అటు డైరెక్టర్ గా వక్కంతం వంశీకి ఇటు హీరోగా నితిన్ కి భారీ కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : 'యానిమల్' మూవీలో ఆ 18 నిమిషాలు అరాచకమే!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply