Animal Movie : 'యానిమల్' మూవీలో ఆ 18 నిమిషాలు అరాచకమే!
Animal Movie : రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీ ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ ఏకధాటిగా 18 నిమిషాలు ఉంటుందట.
Animal Interval Block : బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'యానిమల్'(Animal) మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. హిందీ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో 'యానిమల్' కోసం నార్త్ తో పాటు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్రమోషన్స్ కూడా అన్ని భాషల్లో చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో ప్రమోషన్స్ చేసిన మూవీ టీం నుంచి సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి.
ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ 'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. 'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ ఏకధాటిగా 18 నిమిషాల పాటు ఉంటుందట. ఇంత నిడివితో గతంలో మరే సినిమా ఇంటర్వెల్ బ్లాక్ రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం రణ్ బీర్ కపూర్ సిక్కుల గెటప్ లో ఉన్న అనుచరులని తీసుకొచ్చి మిషన్ గన్ తో సృష్టించే విధ్వంసం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ట్రైలర్ లో ఇందుకు సంబంధించి కొన్ని షాట్స్ కూడా హైలెట్ అయ్యాయి. తెల్లటి లాల్చీతో దుస్తుల నిండా రక్తం పూసుకొని రణ్ బీర్ చేసే అరాచకం మాటల్లో వర్ణించలేమని అంటున్నారు.
నిర్మాత ప్రణయ్ కేవలం ఇంటర్వెల్ బ్లాక్ రన్ టైమ్ గురించి మాత్రమే చెప్పారు. కానీ టీమ్ నుంచి అందుతున్న లీక్స్ అంతకుమించి ఉన్నాయి. స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ కంపోజ్ చేసిన ఈ ఇంటర్వెల్ ఫైట్ హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మించే విధంగా ఉంటుందట. ఈ అప్డేట్ కాస్త సినిమా పై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇంటర్నల్ బ్లాక్ తో పాటు సినిమాలో ఉన్న మిగతా యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని ఇప్పటికే ట్రైలర్ ద్వారా స్పష్టమయింది. సందీప్ రెడ్డి అండ్ టీం ప్రమోషన్స్ విషయంలో పక్కా ప్లానింగ్ తో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సినిమాపై ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
నార్త్ లోనే అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ 'యానిమల్' క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటికే హైదరాబాదులో కొన్ని మల్టీప్లెక్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నార్త్ లో సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'(Tiger 3) కి మించి 'యానిమల్'(Animal) బుకింగ్స్ ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడమే ఆలస్యం బాక్స్ ఆఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత మామూలుగా ఉండదు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రిగా కనిపించనున్నాడు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ విడుదల కాబోతోంది.
Also Read :సోషల్ మీడియాలో రౌడీ బాయ్ దూకుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే రికార్డ్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply